ఎన్టీఆర్ ఇలాకాలో టీడీపీ మళ్ళీ చేతులెత్తేసినట్లేనా...?

VUYYURU SUBHASH
గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్తితులు ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. అసలు మొదట గుడివాడ టీడీపీకి కంచుకోటగానే ఉంది...కానీ ఎప్పుడైతే కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీ వైపుకు వెళ్లారో అప్పటినుంచి గుడివాడలో టీడీపీ నిలబడలేకపోతుంది...నాయకులని మార్చిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికీ నియోజకవర్గంలో పార్టీ పరిస్తితి మరీ ఘోరంగానే ఉంది. ఇంచార్జ్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావు...అంతగా పనిచేయడం లేదు.

అసలే నాని అధికారంలో ఉన్నారు...మంత్రిగా ఉన్నారు...ఇలాంటి పరిస్తితుల్లో గుడివాడలో పోరాటాలు అవి చేస్తే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందో అని చెప్పి రావి సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో గుడివాడలో టీడీపీ పరిస్తితి మరీ దిగజారిపోతుంది. ఇప్పటికే చాలావరకు క్యాడర్ చేజారిపోయింది. మళ్ళీ గుడివాడలో టీడీపీ గెలవడం కష్టమని భావించి క్యాడర్ నాని వైపు వెళ్లిపోతున్నారు. అయితే పోరాటాలు అవి చేయకపోయినా కనీసం క్యాడర్‌ని నిలబెట్టుకునేలా రావి పనిచేస్తే బెటర్ గా ఉండేది.

అలాగే స్థానిక ఎన్నికల్లో కాస్త పోటీకి దిగేలా చేస్తే బాగుండేది.. కానీ అది చేయలేదు. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే పంచాయితీ ఎన్నికల్లో మాత్రం క్యాడర్ గట్టిగానే పోరాడింది...వైసీపీకి ధీటుగా పంచాయితీలని కైవసం చేసుకుంది. కానీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో చేతులెత్తేసింది...దీంతో గుడివాడలో నానికి తిరుగులేదని మరోసారి రుజువైంది. ఇక అతి త్వరలోనే గుడివాడ మున్సిపాలిటీకి ఎన్నిక జరగనుందని తెలుస్తోంది. గతంలో గుడివాడ మున్సిపాలిటీకి ఎన్నిక వాయిదా పడింది.

ఆ ఎన్నిక త్వరలోనే నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో వాయిదా పడిన పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే గుడివాడ మున్సిపాలిటీకి కూడా ఎన్నిక జరగనుంది. ఇక ఈ మున్సిపాలిటీ కూడా వైసీపీనే కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

టీడీపీ వేవ్ ఉన్న 2014లోనే ఈ మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకునేలా చేశారు. కాకపోతే తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో మున్సిపల్ ఛైర్మన్ టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నానికి తిరుగులేని బలం ఉంది...దీంతో మరొకసారి గుడివాడలో వైసీపీ సత్తా చాటడం, టీడీపీ చేతులెత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: