భరత్-రాజాలు సర్దుకున్నారా? వైసీపీకి డ్యామేజ్ తగ్గిందా?

M N Amaleswara rao
అధికార పార్టీ అన్నాక ఆధిపత్య పోరు సహజమే...నాయకులకు భిన్నాభిప్రాయాలు ఉండటం మామూలే...తమ తమ స్థానాల్లో పట్టు దక్కించుకునే విషయంలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది....అలాగే తమకు కావల్సిన నాయకులకు పదవులు దక్కించుకునే విషయంలో సైతం ఈ పోరు ఉంటుంది. అందుకే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడిచింది.
ఆ మధ్య ఇద్దరు నేతలు బహిరంగంగా మీడియా సమావేశాలు పెట్టుకుని విమర్శలు చేసుకునే పరిస్తితి...భరత్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని, టీడీపీ నేతలతో కలిసి పనిచేస్తున్నారని రాజా ఆరోపించడం...ఆ ఆరోపణలకు భరత్ కౌంటర్లు ఇవ్వడం...రాజాపై రివర్స్‌లో విమర్శలు చేయడం జరిగిపోయాయి. అయితే ఈ ఇద్దరు నేతలు రోడ్డు ఎక్కడంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది....ఇద్దరు నేతలకు జగన్ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఇద్దరు నాయకులు సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.


అలా అని ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మాత్రం సర్దుకున్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు నేతలు ఎవరి పని వారు చేసుకుంటున్నారు గానీ, కలవడం మాత్రం జరగలేదని చెబుతున్నారు. అయితే ఇద్దరు నేతలు ఎవరికి వారు అన్నట్లుగా పనిచేస్తే వైసీపీకి కాస్త డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇద్దరు కలిసి పనిచేస్తేనే పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు.


ఎందుకంటే భరత్ రాజమండ్రి ఎంపీగా ఉన్నారు...అదే పార్లమెంట్ పరిధిలో ఉన్న రాజానగరం ఎమ్మెల్యేగా రాజా ఉన్నారు. అంటే వీరు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు ప్రదర్శించడం వల్ల నెక్స్ట్ ఓట్లలో చీలిక వచ్చే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పుడు రాజానగరం అసెంబ్లీలో రాజాకు అనుకూలంగా ఉండేవారు...ఎమ్మెల్యే ఓటు రాజాకు వేసి...ఎంపీ ఓటు క్రాస్ ఓటింగ్‌కు వెళితే భరత్‌కు దెబ్బ. అదేవిధంగా రివర్స్‌లో క్రాస్ ఓటింగ్ జరిగిన ఇబ్బందే. కాబట్టి ఇద్దరు నేతలు ఆధిపత్య పోరుని పక్కనబెట్టి కలిసి పనిచేస్తే వైసీపీకే ప్లస్ అవుతుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: