పుష్పశ్రీ వాణికి హ్యాట్రిక్ ఛాన్స్ ఉందా?

M N Amaleswara rao
రాజకీయాల్లో కష్టంతో పాటు అదృష్టం కూడా తోడైతే వారికి తిరుగుండదనే చెప్పాలి. అలా కష్టంతో పాటు అదృష్టం కలిసొచ్చిన నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే...ఏపీలో పుష్పశ్రీ వాణి అని చెప్పొచ్చు. చిన్న వయసులోనే పుష్పశ్రీ రాజకీయాల్లోకి వచ్చేశారు. పైగా చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ వచ్చింది...2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున కురుపాంలో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమె ఎమ్మెల్యేగానే కొనసాగారు...అలాగే పార్టీ మారకుండా జగన్‌కు సపోర్ట్‌గా ఉంటూ వచ్చారు.
ఇక ఇదే ఊపులో పుష్పశ్రీకి 2019 ఎన్నికలు బాగా కలిసొచ్చాయి...ఆ ఎన్నికల్లో కూడా పుష్పశ్రీ సత్తా చాటారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆమె అదృష్టం ఎలా కలిసొచ్చిందంటే...చాలామంది సీనియర్లు ఉన్నా సరే పుష్పశ్రీకు మంత్రి పదవి దక్కింది...అలాగే డిప్యూటీ సీఎం హోదా కూడా దక్కింది. జగన్ క్యాబినెట్‌లో ఉన్న ఏకైక డిప్యూటీ సీఎం పుష్పశ్రీనే. అంటే పుష్పశ్రీకు ఎంత లక్ కలిసొచ్చిందో చెప్పాల్సిన పని లేదు.
మరి ఆ అదృష్టాన్ని పుష్పశ్రీ వాణి చక్కగా ఉపయోగించుకున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఎఫెక్టివ్ గా పనిచేయలేదనే చెప్పాలి. కొన్ని రోజులు వ్యక్తిగత కారణాల వల్ల కాస్త యాక్టివ్ గా లేరు. కానీ తర్వాతైన ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనబడటం లేదు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా పుష్పశ్రీ వాణి హైలైట్ కాలేదనే చెప్పాలి...తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజిని, జొన్నలగడ్డ పద్మావతి లాంటి వారే బాగా హైలైట్ అయ్యారు. కానీ పుష్పశ్రీ వాణి కాలేకపోయారు.
ఇక నెక్స్ట్ టర్మ్‌లో పుష్పశ్రీ పదవి కూడా పోనుందని తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యేగా ఉంటారు...మరి ఎమ్మెల్యేగా పుష్పశ్రీ...కురుపాం నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే..నెక్స్ట్ హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టే అవకాశం ఉంటుంది..లేదంటే అంతే సంగతులు...మళ్ళీ ఇంకో ఛాన్స్ రావడం కష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: