అతి తొందరలోనే అమిత్ షాతో బాబు... ?

Satya
ఏపీ రాజకీయాలు ఎపుడూ హీట్ మీదనే ఉంటాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ ఉంది. దాంతో తెగే దాకా లాగుతూండడంతో నిత్య సంఘర్షణగా రాజకీయం మారుతోంది. దీని వల్ల ఎవరి లాభం వారికి ఉన్నా మధ్యన వేడి సెగలు తగిలేది అటు పార్టీ జనాలకూ, ఇటు సాదర జనాలకే అనుకోవాలి.
ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో తొందరలోనే చంద్రబాబు సమావేశం అవుతారు అని అంటున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసినా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లభించలేదు అన్న విమర్శలు వచ్చాయి. చంద్రబాబు ఏపీకి తిరిగి వచ్చాక అమిత్ షా స్వయంగా బాబుకు ఫోన్ చేశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు తాజాగా చెబుతున్నాయి. చంద్రబాబుతో మాట్లాడిన అమిత్  షా ఆయన చెప్పిన వివరాలు అన్నీ జాగ్రత్తగా విన్నారని అంటున్నారు.
మరో వైపు అమిత్ షా బాబుని ఢిల్లీ రమ్మని కోరారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే దీని మీద బాబు ఇప్పటికిపుడు వెళ్లకుండా కాస్తా ఆగి అన్నీ పక్కాగా చూసుకునే హస్తిన టూర్ పెట్టుకుంటారు అంటున్నారు. హస్తినలో ఈసారి బాబు టూర్ ఏపీ రాజకీయాలలో మంటలు పెట్టేదిగానే ఉంటుంది అంటున్నారు. అన్నీ కుదిరితే కనుక దీపావళి పండుగ తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు అంటున్నరు. ఆయన తాను ఏపీ సర్కార్ తీరు మీద చేయాల్సిన ఫిర్యాదులు చేస్తారని అంటున్నారు. అదే సమయంలో బీజేపీతో సాన్నిహిత్యాన్ని కూడా కోరుకుంటారు అంటున్నారు. ముఖా ముఖీ మాట్లాడితే బీజేపీ టీడీపీల మధ్య  చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది అని కూడా తెలుగుదేశంలో చర్చ నడుస్తోంది. మొత్తానికి బాబు కనుక అమిత్ షాతో భేటీ అయితే ఏపీలో రాజకీయ సమీకరణలల్లో మార్పులు రావడం ఖాయమే అంటున్నారు. చూడాలి మరి ఏపీలో ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా సాగుతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: