చంద్రబాబుకు ఢిల్లీలో షాక్.. ఏం జరిగింది..?

MOHAN BABU
టిడిపి నేత చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ను కలిసేందుకు అపాయింట్మెంట్లు కోరిన  లభించే పరిస్థితులు లేకపోవడంతో ఆయన తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. అమిత్ షా జమ్మూకాశ్మీర్ వ్యవహారాల్లో బిజీగా  ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అపాయింట్మెంట్ ఎప్పుడు లభిస్తుందో స్పష్టత లేదు. ఇక ప్రధాని అపాయింట్మెంట్ కూడా లభించే అవకాశం కనపడడం లేదు. అయితే కేంద్ర మంత్రులను కలిసి ఏపీ పరిస్థితులను వివరించాలనుకున్నారు. కానీ ఈ విషయంలో కూడా నిరాశే ఎదురవడంతో ఒక రాష్ట్రపతిని మాత్రం కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేయగలిగారు. హోంమంత్రి అమిత్ షా  అపాయింట్మెంట్ లభించిన తర్వాత  చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళతారని సమాచారం.

 ఇటు చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై వైసిపి కౌంటర్ ఎటాక్  పెంచింది. కేవలం డ్రామాల కోసమే చంద్రబాబు ఢిల్లీ టూర్ అంటూ వైసీపీ కామెంట్ చేస్తోంది. అవసరమైతే తాము కూడా ఢిల్లీ వెళ్దామంటున్నారు వైసీపీ మంత్రులు. సీఈసి కి వైసీపీ ఫిర్యాదు చేసి టిడిపి గుర్తింపును రద్దు చేయాలని కోరుతున్నారు. సమయం చూసుకొని ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వైసిపి నేతలు తెలుపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అంతంతమాత్రంగానే సాగింది అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు వెళ్ళిన రోజు కేవలం  రాష్ట్రపతిని మాత్రమే  కలిసారు తర్వాత 24 గంటలు పాటు ఖాళీగానే ఉన్నారు. తర్వాత హైదరాబాద్ కు రావడం జరిగింది. టిడిపి ఢిల్లీ పర్యటన మీద చాలా హోప్స్ పెట్టుకుంది. చంద్రబాబుతో పాటు 19 నాయకులు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆర్టికల్ 356  ని రద్దు చేయాలని అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలనే ఏకైక డిమాండ్ తో ఢిల్లీ వెళ్లడం జరిగింది. వైసిపి నేతలు తమపై చేస్తున్న దాడులకు సంబంధించి ఢిల్లీ పెద్దలకు చెప్పాలని వెళ్లారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ లో కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన డిమాండ్ చేసే సమయంలో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కేంద్ర హోం మంత్రి ని కలవడం, ప్రధానిని కలవడం తర్వాత ఫైనల్ గా రాష్ట్రపతిని కలసి వారిద్దరి ఫీడ్ బ్యాక్ చూసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ రివర్స్ లో మొదట ఆయన రాష్ట్రపతిని కలిశారు కాబట్టి ఇది  పెద్దగా డిమాండ్ చేసే అవకాశంలేదు.అందువల్ల కూడా చంద్రబాబు ఢిల్లీ టూర్ పెద్దగా సక్సెస్ కాలేదని అంటున్నారు.

రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుందని వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని, శాంతిభద్రతలకు  కలుగుతుందనే ఒక రీజన్ తో రెండు రోజుల దీక్ష చేసి ఆ తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లారు కాబట్టి ఢిల్లీ పర్యటన కొంత ఆసక్తి గా ఉంటుందని టిడిపి శ్రేణులు చూశారు. రాజకీయంగా టిడిపికి ఒక బూస్టప్ కావాలంటే ఏదో ఒక ఇష్యూ అవసరమని రాజకీయంగా పట్టు సాధించడానికి దీన్ని బేస్ చేసుకుని టిడిపి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటన కూడా పెట్టుకుంది. కానీ ఢిల్లీ పర్యటన పెద్దగా సక్సెస్ అవకపోవడం తో టిడిపి నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ గనక ప్రధాని, హోంమంత్రి  అపాయింట్మెంట్ ఇస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. లేకపోతే ఈ పర్యటన ఇంతటితో ముగిసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: