బద్వేల్: వైసీపీ గెలుపుకు మరో రెండు రోజులే?

VAMSI
మరో మూడు రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాలలో జరగబోయే ఉప ఎన్నికలకు సర్వం సిద్దంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి ఎన్నిక జరగనుండగా, అక్కడ తెలంగాణలో హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి పోటీ జరగనుంది. ఈ రెండు ఎన్నికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజుతో ప్రచారాలకు తెరపడింది. ఇక ఎన్నికలకు రెండు రోజులే ఉండడంతో నాయకులూ అంతా ఈ పనిలోనే ఉన్నారు.  గత కొద్ది రోజుల నుండి బద్వేల్ నియోజకవర్గంలో నాయకుల ప్రచారాలతో హోరెత్తిపోయింది. ప్రస్తుతం ఈ ఎన్నికల పోరులో ప్రధానంగా పోటీ అధికార వైసీపీ మరియు బీజేపీ ల మధ్యనే  ఉండనుంది.
అనూహ్యంగా టీడీపీ ఈ ఎన్నికలో పోటీ చేయకపోవడం గమనార్హం. అయితే ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంది. ఎలా అయినా వైసీపీని ఓడించాలని ఈ రెండు పార్టీలు కంకణం కట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం బీజేపీకి సపోర్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీదే కాబట్టి ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వైసీపీ విజయ భేరి మోగిస్తుందని అధిష్టానం ఏంటో నమ్మకంగా ఉంది.  ప్రచారంలో వైసీపీ బీజేపీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఈ ఎన్నికకు అధిక ప్రాధాన్యత వచ్చేలా చేశారు.
ఈ ఎన్నికలో గెలుపే ప్రధాన లక్ష్యంగా బీజేపీ వైసీపీలు జోరుగా తమ వ్యూహాల్లో భాగమై ఉన్నాయి. ఇందులో భాగంగానే బదులు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఇటు పార్టీల నాయకులు పగలు రాత్రి అక్కడే ఉంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 30 వతేదీన పోలింగ్ జరగనుంది. అయితే ఓటర్లు ఎవరికి షాక్ ఇస్తారో? ఎవరిని ఎమ్మెల్యే చైర్ పై కూర్చోబెడతారో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: