టీడీపీతో తెలంగాణా పోలీస్ అధికారి డీల్, విజయసాయి సంచలన విషయాలు...?

Gullapally Rajesh
ఏపీలో గంజాయి వ్యవహారానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు స్పందించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనిపై స్పందించడం పట్ల ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పలు పోస్ట్ లు షేర్ చేసారు. ఇక పవన్ కళ్యాణ్ గంజాయి వీడియోల పై స్పందించిన విజయసాయిరెడ్డి... తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ ఎక్కడ గుంజాయి దొరికినా దాని మూలం ఏపీనే అని ఆయా రాష్ట్రాల పోలీసు అధికారుల వీడియోలు పోస్ట్ చేసారు పవన్.
ఏ రాష్ట్రం లో గంజాయి దొరికినా.. పోలీసులు వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేస్తారు... అని దొరికిన గంజాయి ఏపీకి సంబంధించినది అని ఆధారాలతో సహా చూపించాలి.. ఆరోపణలు చేస్తే సరిపోదు అని అన్నారు పవన్. టీడీపీ తో కుమ్మక్కయిన తెలంగాణ పోలీస్ అధికారి వారి పోలీస్ మిత్రులతో కలిసి అరకు వ్యాలీకి వెళ్లి అక్కడ గంజాయి సాగు జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఏపీ సరిహద్దులోని తెలంగాణ  రాష్ట్రానికి చెందిన ఒక జిల్లా పోలీసు అధికారి టీడీపీతో కుమ్మక్కయ్యారు అని అన్నారు.
అతని వివరాలు నాదగ్గర ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. అతను బయటకి వచ్చి అన్ని వివరాలు చెప్పాలి అని డిమాండ్ చేసారు. రాజకీయంగా టీడీపీతో కలిసి తప్పుడుగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారిపై సీఎం కేసీఆర్ కి ఫిర్యాదు చేస్తా అన్నారు ఆయన. గంజాయి సాగు విషయంలో 2014 నుంచి 2019 వరకు ఏపీలో నమోదయిన కేసుల కంటే 2019 నుంచి 21 వరకు గంజాయి సంబంధిత కేసులు తక్కువ అని ప్రస్తుతం ఏపీలో గంజాయి సాగు,పట్టుకున్న కేసులు తగ్గాయి అని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: