పోలీసులపై వైసీపీ ఎంపీ విమర్శలు...!

Gullapally Rajesh
వైస్సార్ భరోసా కింద 13,500 వేలు ఇస్తున్న ప్రభుత్వం వైసీపీ అని అంటున్నారు అని... కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పీఎం కిసాన్ పేరిట ఏడాదికి 6 వేల రూపాయలు ఇస్తున్నారు అని మా ప్రభుత్వం ఇస్తుంది 7500 రూపాయలు మాత్రమే అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు. నిస్సిగ్గుగా మా ప్రభుత్వం మొత్తం మేమే ఇస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారు అని అన్నారు ఆయన. స్థల దాహంతో ఎయిడెడ్ స్కూల్స్ ను సొంతం చేసుకుంటున్నారు అని విమర్శలు చేసినట్టు ఉన్నారు.
165 ఎయిడెడ్ కళాశాలలు  ఉన్నాయి...ఏ అధికారం ఉందని ఎయిడెడ్ కళాశాలలులను తీసుకుంటున్నారు అని ఆయన నిలదీశారు. కోర్టుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు,కోర్టును తప్పుదోవ పట్టించారు అని ఆయన విమర్శలు చేసారు. విశాఖపట్నం లో నాలుగు స్కూల్స్ వాళ్ళు మూసివేస్తామని చెప్పారు అని ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నియమించిన వ్యక్తి నాకు నచ్చిన్నటు నేను ఉంటా అంటే బాగోదు అని అన్నారు. మనం ఇచ్చే అమ్మఒడి ఏ మూలకు సరిపోదు...ఎయిడెడ్ స్కూల్స్ జోలికి వెళ్లొద్దు అని ఆయన విజ్ఞప్తి చేసారు.
పది ఏళ్ల బాలుడు విశాఖపట్నం లో ఎవరికి కావాలి నీ బెల్ట్ అని మాట్లాడాడు అని పది ఏళ్ల బాలుడిని స్ఫూర్తిగా అందరూ తీసుకోవాలి అని ఆయన సూచించారు. దయచేసి చెప్పుడు మాటలు విని ప్రజలకు అబ్దాలు చెప్పడం మంచిది  కాదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నడుస్తున్న వ్యవస్థలను ఎందుకు సర్వనాశనం చేస్తున్నారు అని మండిపడ్డారు. దీనివలన ప్రభుత్వానికి,పార్టీకి నష్టం జరుగుతుంది అని అన్నారు. విద్యావ్యవస్థను గొప్పగా చేస్తామని అనుకోవచ్చు....మానేయండి... ప్రజల ఇబ్బందులు అర్ధం చేసుకోండి అని విజ్ఞప్తి చేసారు. ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ కళాశాలలు గురించి ఆలోచించండి అని ఆయన విజ్ఞప్తి చేసారు. పోలీసు దూరగతలు దారుణంగా ఉన్నాయి అని ఆయన విమర్శలు చేసారు. 41A నోటీసు ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు,రూల్స్ ఫాలో అవ్వడం లేదు అని ఆయన విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: