బద్వేలు : వాళ్ల పోటీ నోటాతోనేనా.. ఆ ప‌రువు కూడా ఉండ‌దా..!

VUYYURU SUBHASH
ఏపీలో బ‌ద్వేల్ నియోజకవర్గానికి ఈ నెల 30న పోలింగ్ జ‌రుగుతోంది. వ‌చ్చే నెల 2వ కౌంటింగ్ జ‌రుగుతుంది. అయితే ఇక్క‌డ వైసీపీ పోటీ బీజేపీతోనే..!  విచిత్రం ఏంటంటే ఏపీలో గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల నుంచి ఏ ఎన్నిక జ‌రిగినా కూడా బీజేపీ ప్ర‌ధానంగా నోటాతో పోటీ ప‌డుతూ వ‌స్తోంది. బీజేపీ నోటా మీద గెలిస్తేనే గొప్ప. అలాంటిది గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో నోటా కంటే కూడా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. అస‌లు ఏపీ జ‌నాలు బీజేపీ పేరు చెపితేనే ఏ స్థాయిలో మండి ప‌డుతున్నారో ఆ పార్టీకి వ‌స్తోన్న ఓట్లే నిద‌ర్శ‌నం. అస‌లు ఇటీవ‌ల జ‌రిగిన తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పొత్తు ఉండ బ‌ట్టే బీజేపీ 50 వేల ఓట్లు క్రాస్ చేసింది. అదే జ‌న‌సేన పొత్తు లేకపోయి ఉంటే బీజేపీకి 10 వేల ఓట్లు కూడా వ‌చ్చేవే కావ‌ని విశ్లేష‌కుల టాక్ ?

ఇక ఇప్పుడు బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ గెల‌వ‌డం సంగ‌తి అటు ఉంచితే ఆ పార్టీకి క‌నీసం డిపాజిట్లు అయినా వ‌స్తాయా ? అన్న‌ది పెద్ద సందేహం . పైగా మ‌రో జాతీయ పార్టీ కాంగ్రెస్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు సాధించే టార్గెట్ ఆ పార్టీ ఉంది. అన్నింటికి మించి బీజేపీ ఇక్క‌డ పోటీ ప‌డేది నోటాతోనే అని అంటున్నారు. నోటా కంటే బీజేపీ కి ఎక్కువ ఓట్లు వ‌స్తే అదే పెద్ద గొప్ప అని అంటున్నారు. ఇక్క‌డ బీజేపీ త‌ర‌పున ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రా జుతో పాటు మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి లాంటి వాళ్లు మాత్ర‌మే ప్ర‌చారం చేశారే త‌ప్పా ఎవ్వ‌రూ ప‌ట్టించు కోలేదు.

ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల బీజేపీ వ్యవహారాలకు తానే పెద్ద అన్నట్లుగా వ్యవహరించే కిషన్ రెడ్డి కూడా బ‌ద్వేల్ వైపు చూడ‌లేదు. అస‌లు తెలంగాణ లోని హుజురాబాద్‌పై ఆయ‌న పెట్టిన దృష్టి కూడా చాలా త‌క్కువ‌. అలాంటి ఏపీలో ఈ ప‌నికి రాని ఎన్నిక గురించి ఆయ‌న ఎందుకు ప‌ట్టించు కుంటారు ? అయితే బీజేపీ మాత్రం ఇక్క‌డ విప‌రీత‌మైన హ‌డావిడి చేస్తోంది. చివ‌ర‌కు నోటాకు క‌న్నా ఎక్కువ ఓట్లు తెచ్చు కుంటుందో ?  లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: