బద్వేలు: జ‌గ‌న్ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

VUYYURU SUBHASH
ఏపీలో బ‌ద్వేల్ ఉప ఎన్నిక చాలా చ‌ప్ప‌గా సాగుతోంది. గ‌తంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు అదే రాయ‌ల సీమ‌లోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రిగిన‌ప్పుడు అస‌లు ఏపీ లో ప్ర‌తి జిల్లాలోనూ.. ప్ర‌తి మండ‌లంలోనూ ప్ర‌జ‌లు ఎంత ఉత్కంఠ అనుభ‌వించారో చూశాం. నంద్యాల ఉప ఎన్నిక అనేది కేవ‌లం నంద్యాల‌కు ప‌రిమితం కాలేదు. అది రాష్ట్ర ఎన్నిక‌లా జ‌రిగింది. అక్క‌డ ఓడిపోతే అధికారం పోతుంద‌న్న‌ట్టుగా రెండు పార్టీల మ‌ధ్య పోరు జ‌రిగింది. రెండు పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న త‌మ నేత‌ల‌ను అక్క‌డ వీథుల్లోనూ.. వార్డుల్లో నూ మోహ‌రించేశాయి.

ఇప్పుడు అదే ఏపీలో అదే సీమ‌లోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. కానీ ఇక్క‌డ టీడీపీ పోటీలో లేదు. దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఎంత ఉత్కం ఠ గా జ‌రిగిందో ఇప్పుడు బ‌ద్వేల్ ఉప ఎన్నిక అంత చ‌ప్ప‌గా జ‌రుగుతోంది. బ‌ద్వేల్లో అధికార వైసీపీ గెలుపు లాంఛ‌న‌మే అన్న‌ది అంద‌రికి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఇక్క‌డ వైసీపీకి ల‌క్ష మెజార్టీ రావాల‌ని జ‌గ‌న్ టార్గెట్ పెట్టారు. జ‌గ‌న్ అనుకున్నంత మెజార్టీ ఇక్క‌డ వ‌స్తుందా ? అన్న‌దే డౌట్ గా ఉంది. ఇందుకు కార‌ణం.. ఇక్క‌డ టీడీపీ పోటీ చేయ‌క‌పోయినా ఆ పార్టీ వాళ్లలో చాలా మంది బీజేపీకి ఓట్లేసేందుకు లేదా కాంగ్రెస్ కు ఓటే సేందుకు ఇష్టంగా ఉన్నారే త‌ప్పా వైసీపీకి ఓట్లే సేందుకు ఇష్టంగా లేరు. పైగా ప్ర‌భుత్వ యాంటీ ఓటింగ్ ఇక్క‌డ ఎక్కువుగా ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

ఇక ఇక్క‌డ ఎంత పోలింగ్ జ‌రుగుతుంద‌ని అన్న దానిపై కూడా వైసీపీ మెజార్టీ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇక్క‌డ జ‌రిగే పోలింగ్ శాతంతో పాటు బీజేపీకి ప‌డే ఓట్లు ఇవ‌న్నీ కూడా వైసీపీ మెజార్టీ ని నిర్ణ‌యించ‌నున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: