బద్వేలు : వీర్రాజు చేసేదేంలేకే అరుస్తున్నారా ?

VUYYURU SUBHASH
బ‌ద్వేల్లో గెలుపు వైసీపీ దే అన్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు ఆ పార్టీకి ఎంత మెజార్టీ వ‌స్తుంది ?  ఇక్క‌డ సెకండ్ ప్లేస్‌లో కాంగ్రెస్ ఉంటుందా ?  బీజేపీ ఉంటుందా ? అన్న‌ది మాత్ర‌మే క్లారిటీ రావాల్సి ఉంది. అది ఎలాగూ ఎన్నిక‌ల కౌంటింగ్ రోజు తేలిపోతుంది. విచిత్రం ఏంటంటే బ‌ద్వేల్లో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అరుస్తోన్న అరుపులు, పెడుతోన్న కేక‌లు బొబ్బ‌లు చూస్తుంటే మాత్రం చాలా కామెడీగా ఉంది. అస‌లు వీర్రాజు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాష్ట్రం లో ఆ పార్టీ ప‌రిస్థితి చాలా ఘోరంగా దిగ‌జారిపోతోం ది. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి వ‌చ్చిన 50 వేల ఓట్లు కూడా ఆదినారాయ‌ణ రెడ్డితో పాటు స్థానిక బీజేపీ నేత‌ల వ‌ల్లే వ‌చ్చాయి. అందులో వీర్రాజు గొప్ప లేదు.
ఇక ఇప్పుడు బ‌ద్వేల్లో ఆ పార్టీకి క‌నీసం చాలా బూత్ ల‌లో కూడా ఏజెంట్లు లేని దుస్థితి. అయితే అదే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి రంగంలోకి దిగి.. త‌న‌కు టీడీపీలో ప‌రిచ‌యం ఉన్న నేత‌ల‌ను బ‌తిమి లాడో లేదా వాళ్ల‌కు ఏవో పైస‌లు ప‌డేసో క‌నీసం ఏజెంట్ల‌ను అయినా పెట్టారు. అదే వీర్రాజు మీద ఈ ఎన్నిక‌ల భారం పెట్టి ఉంటే ఆయ‌న టాలెంట్ కు క‌నీసం బూత్ ఏజెంట్లు , కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరికే వారు కాద‌నే చెప్పాలి. అది ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మ‌న వీర్రాజు ద‌మ్ము.
ఇక ప‌దే ప‌దే బ‌ద్వేల్లో వైసీపీ అక్ర‌మాలు చేస్తోంద‌ని అర‌వ‌డం త‌ప్పా ఆయ‌న ప్ర‌చారానికి వెళుతుంటే ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా ఆయ‌న వెన‌కాల రావ‌డం లేదు. అస‌లు ఆయ‌న్ను అక్కడ ప‌ట్టించుకునే వారే లేకుండా పోయారు. క‌నీసం డిపాజిట్లు కూడా వ‌స్తాయో రావో తెలియ‌దు. వీర్రాజు సంగ‌తి ఎలా ఉన్నా మాజీ మంత్రి ఆదినారాయ‌ణ మాత్రం గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట్లు కోసం తాప‌త్ర‌య ప‌డుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: