బద్వేలు : జగన్ టార్గెట్ బాబే ?

VUYYURU SUBHASH
బ‌ద్వేల్లో వైసీపీ గెలుపు ఏక‌ప‌క్షం అన్న‌ది తేలిపోయింది. అయితే ఇక్క‌డ టీడీపీ పోటీ చేయ‌లేదు. పోటీ చేసినా ఎలాగూ ఓడిపోతాం అన్న‌ది తేలిపోయింది. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో బాబు చేసిన హ‌డావిడి మామూలుగా లేదు. చివ‌ర‌కు రంగంలోకి దిగి.. పైగా కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మిని పోటీ పెడితే 3 ల‌క్ష‌ల కు పైగా ఓట్ల భారీ తేడాతో టీడీపీ ఓడిపోయింది. ఇప్పుడు బ‌ద్వేల్లో కూడా చంద్ర‌బాబు త‌మ పార్టీ క్యాండెట్ ను పోటీ పెట్టి ఉంటే మ‌రో ఘోర ప‌రాభ‌వం ఆయ‌న ఖాతాలో ప‌డి ఉండేది. చంద్ర‌బాబు మాత్రం తెలివిగా ఈ ఓట‌మి నుంచి ఎస్కేప్ అయ్యారు.
క‌ట్ చేస్తే ఇక్క‌డ టీడీపీ పోటీ చేయ‌క‌పోయినా కూడా జ‌గ‌న్ బాబు టార్గెట్ గా ఉన్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఇక్క‌డ ల‌క్ష ఓట్ల మెజార్టీతో త‌మ పార్టీ అభ్య‌ర్థిని గెలిపిం చుకుని త‌న స‌త్తా ఏంటో చాటి చెప్పాల‌ని ఉవ్విళ్లూరు తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు తిరుప‌తి అసెంబ్లీ స్తానానికి ఉప ఎన్నిక జ‌రిగింది. అప్పుడు వైసీపీ త‌మ పార్టీ నేత‌ను పోటీ పెట్ట‌లేదు. చంద్ర‌బాబు తిరుప‌తిలో త‌మ పార్టీ అభ్య‌ర్థి సుగుణ‌మ్మ గెలుపు మాత్ర‌మే కాకుండా ఏకంగా ల‌క్ష మెజార్టీ యే టార్గెట్ గా పెట్టుకున్నారు. చివ‌ర‌కు టీడీపీకి ల‌క్ష మెజార్టీ వ‌చ్చింది. చంద్ర‌బాబు స‌త్తా ఏంటో చాటుకున్నార‌ని నాడు టీడీపీ హ‌డావిడి చేసింది.
అయితే ఇప్పుడు చంద్ర‌బాబు బ‌ద్వేల్లో త‌మ పార్టీ క్యాండెట్ ను పోటీకి పెట్ట‌లేదు. జ‌గ‌న్ సైతం త‌మ పార్టీ గెలుపు మాత్ర‌మే కాకుండా.. డాక్ట‌ర్ సుధ‌కు ఏకంగా ల‌క్ష మెజార్టీ రావాల‌ని టార్గెట్ పెట్టారు. ఈ భారీ గెలుపుతో అస‌లు రేప‌టి ఎన్నిక‌ల్లో కూడా త‌మ ద‌రి దాపుల‌కు కూడా టీడీపీ రాష్ట్రంలో ఎక్క‌డా రాద‌ని చెప్ప‌డ‌మే జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. మ‌రి ఈ టార్గెట్ లో జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: