బద్వేలు : జగనోరి దెబ్బ - బాబోరు అబ్బా ?

VUYYURU SUBHASH
బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చాలా తెలివిగా చేతులు ఎత్తేశార‌నే చెప్పాలి. అస‌లు గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ టీడీపీ క్యాండెట్ పై వైసీపీ అభ్య‌ర్థి దివంగ‌త డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య ఏకంగా 44 వేల ఓట్ల బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించారు. సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడే ఇంత మెజార్టీ వ‌స్తే ఒక వేళ ఇక్క‌డ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే ఆ పార్టీ ప‌రిస్థితి ఇంకెంత దిగ‌జారి ఉండేద‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న మ‌వుతున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేసిన ఓబులాపురం రాజ‌శేఖ‌ర్ క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేదు. ఒక రకంగా ఇక్క‌డ జ‌గ‌న్ వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి డాక్ట‌ర్ సుధ‌కు సీటు ఇచ్చి చంద్ర‌బాబును సేవ్ చేశార‌నే చెప్పాలి. చంద్ర‌బాబు ఇక్క‌డ తాము పోటీ చేయ‌మ‌ని సంప్ర‌దాయం పేరుతో త‌ప్పించు కునేందుకు ఇది మంచి ఆప్ష‌న్ గా దొరికింది. గ‌తంలో ఈ సంప్ర‌దాయాన్ని తాము తీసుకు వ‌చ్చామ‌ని .. అందుకే ఇక్క‌డ దివంగ‌త శాస‌న స‌భ్యు డి కుటుంబం నుంచి అభ్య‌ర్థి పోటీలో ఉండ‌డంతో తాము ఇక్క‌డ పోటీ చేయ‌డం లేద‌న్న సాకుతో త‌ప్పించే సుకున్నారు.

జ‌గ‌న్ వేసిన దెబ్బ తో బాబోరు అబ్బా అన‌క త‌ప్ప‌లేదు. ఒక వేళ జ‌గ‌న్ వెంక‌ట సుబ్బ‌య్య భార్య లేదా ఆయ‌న కుటుంబం నుంచి కాకుండా ఇత‌రుల కు సీటు ఇచ్చినా కూడా చంద్ర‌బాబు అప్పుడు ఏదో ఒక సాకుతో ఎస్కేప్ అయ్యేవారా ?  లేదా మ‌రో ఘోర ప‌రాజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకునే వా రా ? అన్న‌ది చూడాల్సి వ‌చ్చేది. ఏదేమైనా జ‌గ‌న్ వేస్తోన్న ఎత్తుల‌కు ఏదో ఒక సాకు చూపి త‌ప్పించు కోవ‌డం బాబు కు అల‌వాటు గా అయితే మారిపోయింది. మొత్తానికి బ‌ద్వేల్లో పోటీ చేయ‌కుండానే తెలివిగా ఎస్కేప్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: