బద్వేలు : వైసీపీ పై బీజేపీ గెలుస్తుందా ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ ఉప ఎన్నిక తో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతోంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే బద్వేలు ఉపఎన్నిక కంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పైనే ఫోకస్ చేశారు. దీనికి ముఖ్య కారణం.. హుజూరాబాద్ నియోజకవర్గం లో కెసిఆర్ వర్సెస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నట్లుగా ఉపఎన్నిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పై ఫోకస్ చేశాయి. ఎవరు గెలుస్తారనే దానిపై అందరి దృష్టి పడిందన్న విషయం తెలిసింది.

 

ఇక బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక విషయానికి వస్తే... హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు... బద్వేలు ఉప ఎన్నికలకు చాలా తేడాలు ఉన్నాయి. హుజరాబాద్ నియోజకవర్గం లో పోటాపోటీగా పోటీ నడుస్తోంది... బద్వేల్ నియోజకవర్గం లో మాత్రం చాలా చక్కగా సాగుతోంది ప్రచారం. ఈ బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పు కున్నాయి.  ఇక ఇక ప్రస్తుతం రెండు జాతీయ పార్టీలైన నా కాంగ్రెస్ మరియు బారతీయ జనతా పార్టీలు...   బద్వేల్ పోరు లో ఉన్నాయి. ఇక ముఖ్యంగా అధికార వైసిపి పార్టీ సిట్టింగ్ స్థానం గెలిపించుకునేందుకు బరిలోకి దిగింది. అయితే బద్వేల్ పోరులో బిజెపి హడావిడి చాలా ఎక్కువ గా ఉంది.

గత ఎన్నికల్లో నూట కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని భారతీయ జనతా పార్టీ... ఈసారి గెలుస్తాం అంటూ ప్రకటనలు చేస్తోంది. వైసిపి పార్టీ కి ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉందని... తాము కేంద్ర నిధులతో బద్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు... తాము పోటీ చేస్తే వైసీపీ పార్టీలో వణుకు మొదలైందని.. సెటైర్లు పేలుస్తున్నారు నాయకులు. అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పే మాటలు కామెడీ గా ఉన్నప్పటికీ... వారి వ్యూహం వేరే  ఉందని స్పష్టమవుతుంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలు ఓట్లను లాగే అని భారతీయ జనతా పార్టీ స్కెచ్ వేసినట్లు సమాచారం అందుతోంది.. అయితే.. బద్వేల్ లో ఈ మేరకు భారతీయ జనతా పార్టీ రాణిస్తుందో నవంబర్ 2వ తేదీన తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: