వాళ్లు భ‌జన ఆపేస్తే బాబుకే బెటర్..!

VUYYURU SUBHASH
రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూల మీడియా సంస్థలు వచ్చేశాయి..ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఈ అనుకూల మీడియా ప్రభావం ఎక్కువ. అసలు మీడియానే రాజకీయాలు నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక అటు అధికార వైసీపీకి అనుకూల మీడియా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీలో వైసీపీ అనుకూల మీడియా హవానే ఎక్కువ. ఇటు ప్రతిపక్ష టీడీపీకి అనుకూల మీడియా సంస్థలు ఒకటి, రెండు ఉన్నాయనే విషయం తెలిసిందే.
అయితే మీడియా సంస్థలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టే, రాజకీయ పార్టీలు తమ మనుగడకు పెద్దగా ఇబ్బంది రావడం లేదు. కాకపోతే అనుకూలంగా ఉన్నా సరే మీడియా సంస్థలు నిజాలు చెప్పే పరిస్తితి ఉండాలి..అలాగే అనుకూల నాయకులకు భజన చేయడం తగ్గించాలి. ఈ రెండు విషయాల్లోనూ వైసీపీ అనుకూల మీడియా తగ్గేదేలే అన్నట్లు ముందుకెళుతుంది..జగన్‌కు భజన చేయడం...ప్రభుత్వం తప్పులు చేసినా సమర్ధించుకుంటూ....ఆహా...ఓహో అంటూ పొగడటం ఆ మీడియాల పని.  అలాగే చంద్రబాబుపై బురదజల్లడం.
ఇటు టీడీపీ అనుకూల మీడియా వచ్చి...జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తిచూపిస్తూ ఉంది...ఒకవేళ ఈ మీడియానే లేకపోతే జగన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళేవి కాదనే చెప్పాలి. అదే సమయంలో ఈ అనుకూల మీడియా చంద్రబాబుని లేపే ప్రయత్నం చేస్తుంది..అయితే కొంచెం ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ పైకి లేపితే పర్లేదు. అలా కాకుండా భజన ఎక్కువ చేస్తూ ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల అది మరీ కామెడీ అయిపోతుంది.
తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణుల దాడులకు సంబంధించి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి, రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. ఈ క్రమంలోనే బాబు ఢిల్లీ పర్యటనని టీడీపీ అనుకూల మీడియా బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేసింది....సింహంలా ఢిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు....ఉగ్రరూపంతో రాష్ట్రపతి దగ్గరకు వెళుతున్న చంద్రబాబు అంటూ...లేనిపోని ఎలివేషన్స్ ఇచ్చింది ఒక మీడియా...ఇలాంటి ఎలివేషన్స్ వల్ల కామెడీ అవ్వడం తప్ప అసలు కంటెంట్ రీచ్ అవ్వదనే  చెప్పాలి...కాబట్టి కాస్త భజన తగ్గిస్తే బెటర్ అని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: