కేసీఆర్ vs ఈటల: హుజుర్ బెట్టింగ్.. ఆ అభ్యర్థి గెలుపుపై ఇంత పందెమా..!

MOHAN BABU
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై సాగుతున్నటువంటి బెట్టింగ్ అనేది ఐపీఎల్ ను తలపించేలా ఉన్నది. ఈ దందా లో కోట్ల రూపాయలు చేతులు మారుతూ వస్తున్నాయి. ఆంధ్రాకు చెందినటువంటి కొంతమంది బెట్టింగ్ బాబులు కరీంనగర్ మరియు వరంగల్  హోటళ్లు, రిసార్టులను అడ్డాగా చేసుకొని ఓటర్ నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత బెట్టింగులు  పెడుతున్నారు. దీనికి తోడుగా కొంతమంది ఆన్లైన్ లోనే తమ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మహారాష్ట్ర మరియు కర్ణాటకకు చెందినటువంటి  హుజురాబాద్ యొక్క ఉప ఎన్నికపై ఆసక్తి చూపి బెట్టింగ్ లకు దిడుగుతున్నారంటే ఈ ఎన్నిక ఎంత జోరుగా  జరుగుతుందో అర్థమవుతుంది. అలాగే  హుజురాబాద్ ఉప ఎన్నిక తేదీ దగ్గర పడటంతో  బెట్టింగ్ పర్వం అనేది కొనసాగుతోంది.

ఏపీలో ఉప ఎన్నిక బిజెపి మరియు వైసీపీ మధ్య జరగడంతో అది టిడిపి బరిలో లేకపోవడంతో అక్కడ ఉప ఎన్నిక వన్ సైడ్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి చాలామంది హుజురాబాద్ ఉప ఎన్నిక పైనే బెట్టింగ్ లు వేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం వరకు ఒకవైపు ఉన్నటువంటి బెట్టింగ్ ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల వైపు చేరింది. బిజెపి మరియు టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుపై మొన్నటివరకు 100 నుంచి 250 కోట్ల వరకు అయినటువంటి బెట్టింగులు, ఇంకా 1000కోట్లు పెరిగిందని సమాచారం. రూపాయికి వెయ్యి రూపాయలు అనే  స్థాయిలో పందాలు వేస్తున్నారు. ఇక్కడ వెయ్యి రూపాయల నుంచి మొదలైనటువంటి బెట్టింగు కోట్లకు చేరుకుంది. అభ్యర్థుల యొక్క మెజారిటీ పార్టీల వారీగా వచ్చేటటువంటి ఓట్లపై సైతం బెట్టింగ్ వేస్తున్నారు. బిజెపి అభ్యర్థి గెలుపు టీఆర్ఎస్, గెలుపు తో పాటు ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుందని అంచనా వేస్తూ పందేలు కాస్తున్నారు. ఈటల గెలుస్తారని వందకి పదింతల మంది బెట్టింగ్ వేస్తుంటే, గెల్లు శ్రీనివాస్ గెలుస్తారని వందకి ఆ ఆరింతలా మంది బెట్టింగ్ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: