నెల్లూరు సిటీ, రూరల్‌ల్లో సీన్ మారుతుందా?

M N Amaleswara rao
నెల్లూరు సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాలు...ఏ మాత్రం డౌట్ లేకుండా వైసీపీకి కంచుకోటలు...అంతకముందు కాంగ్రెస్‌కు అనుకూలమైన స్థానాలు...మొదట నుంచి టీడీపీకి పెద్దగా అనుకూలమైన పరిస్తితులు లేవనే చెప్పాలి. ఇక 2014, 2019 ఎన్నికల్లో ఈ రెండు చోట్ల వైసీపీదే హవా. అందులోనూ సిటీలో anil KUMAR YADAV' target='_blank' title='అనిల్ కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనిల్ కుమార్ యాదవ్, రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలదే హవా. రెండు ఎన్నికల్లోనూ వీరు సత్తా చాటుతూనే వస్తున్నారు.
మరి ఈ సారి అక్కడ రాజకీయం మారుతుందా? లేక ఆ ఇద్దరు నేతలు మళ్ళీ హ్యాట్రిక్ కొడతారా అనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే...రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి తిరుగులేదనే చెప్పాలి. ఈ సారి కోటంరెడ్డి హ్యాట్రిక్ కొట్టేలాగానే ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే రూరల్‌లో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది...అదే సమయంలో కోటంరెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే మొదట్లో కోటంరెడ్డి కాస్త వివాదాల్లో ఎక్కువగా ఉండేవారు....కానీ ఈ మధ్య ఆయన సైలెంట్ గా పనిచేసుకుంటూ ఉంటున్నారు. ఎక్కువ ఆవేశానికిలోను కాకుండా...పనిచేసుకుంటున్నారు.


ప్రజలకు అండగా ఉంటున్నారు....తనకు సాధ్యమైన మేర పనులు చేస్తున్నారు. అటు కోటంరెడ్డికి అపోజిట్‌లో టీడీపీ తరుపున అబ్దుల్ అజీజ్ పనిచేస్తున్నారు. ఈయన కూడా దూకుడుగానే పనిచేస్తున్నారు. కాకపోతే ఈయనకు కోటంరెడ్డికి చెక్ పెట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అటు సిటీ నియోజకవర్గానికి వస్తే...ఇక్కడ anil KUMAR YADAV' target='_blank' title='అనిల్ కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు....గత రెండు ఎన్నికల్లో అనిల్ కేవలం స్వల్ప మెజారిటీలతో గెలుస్తూ వచ్చారు.


ఇప్పుడు మంత్రిగా ఉన్నారు...మంత్రి అయ్యాక అనిల్...అంతగా నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం తక్కువైపోతుందని తెలుస్తోంది. అదే సమయంలో నెల్లూరు సిటీలో జరిగే అభివృద్ధి అంతంత మాత్రమే అని తెలుస్తోంది. అటు టీడీపీ తరుపున కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ,...ప్రజా సమస్యలని తెలుసుకుంటూ వారికి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సారి నెల్లూరు సిటీలో అనిల్ మాత్రం టఫ్ ఫైట్ ఎదురుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: