వంశీకి అర్జునుడు సరిపోతారా?

M N Amaleswara rao
కృష్ణా జిల్లా రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి...ముఖ్యంగా అధికార వైసీపీలోని కమ్మ నేతలకు...ప్రతిపక్షంలోని కమ్మ నేతల మధ్య వార్ రసవత్తరంగా నడుస్తోంది. అసలు ఇప్పటికే కొడాలి నాని...టీడీపీపై ఎలాంటి విమర్శలు చేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఆయన మంత్రి అయిన దగ్గర నుంచి టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి...అసలు నాని ప్రజల కోసం మంత్రి అయ్యారో...లేక టీడీపీ కోసం మంత్రి అయ్యారో అనే తేడా తెలియడం లేదు. చెప్పాలంటే టీడీపీ కోసమే కొడాలి మంత్రిగా ఉన్నట్లు కనిపిస్తోంది.
అసలు ఏ స్థాయిలో నాని, చంద్రబాబు అండ్ బ్యాచ్‌ని ర్యాగింగ్ చేస్తారో చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఓ రేంజ్‌లో విరుచుకుపడతారు. ఇక నాని దెబ్బకు టీడీపీ నేతలకే సౌండ్ ఆఫ్ అయిపోతుంది. అయితే నానితోనే పెద్ద తలనొప్పి అనుకుంటే...ఈ మధ్య వల్లభనేని వంశీతో కూడా పెద్ద తలనొప్పి అయిపోయింది. అయితే ఈ ఇద్దరు నేతలు టీడీపీ నుంచి వచ్చిన నాయకులే అని చెప్పాల్సిన పని లేదు. వంశీ...2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి...ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేశారు.


వైసీపీ వైపు వెళ్ళాక వంశీ...పెద్దగా చంద్రబాబుపై విమర్శలు ఏమి చేయలేదు. ఏదో కొంతవరకు బాబుపై విమర్శలు చేశారు. కానీ ఇటీవల వంశీ దూకుడు ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇంకా వ్యక్తిగతంగా కూడా దారుణమైన విమర్శలు చేస్తున్నారు.
ఆ విమర్శలు పక్కనబెడితే...తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని దమ్ముంటే చంద్రబాబు లేదా లోకేష్‌లు వచ్చి...గన్నవరంలో తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ విసురుతున్నారు. దీనిపై టీడీపీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి...చంద్రబాబు, లోకేష్‌లు అవసరం లేదని, తమ నేత బచ్చుల అర్జునుడు చాలని దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. అయితే ఉమా చెప్పినట్లు వంశీకి అర్జునుడు సరిపోతారా? అంటే సరిపోరనే చెప్పాలి. ఎందుకంటే గన్నవరంలో వంశీ ఇమేజ్ ముందు అర్జునుడు ఎందుకు నిలబడలేరు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున అర్జునుడు నిలబడితే విజయం వంశీదే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: