ఆ ఇద్దరికి క్యాబినెట్ బెర్త్‌లు ఫిక్స్?

M N Amaleswara rao
ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియదు గానీ...లోలోపల పదవులు ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు బాగా టెన్షన్ పడిపోతున్నారు. అసలు తమకు పదవులు వస్తాయా?రావా? అని బాగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఇప్పటినుంచే మంత్రి పదవులు కొట్టేయడానికి అనేక మంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారైనా మంత్రి అనిపించుకోవాలని....చాలామంది ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు. కానీ జగన్ ఎవరిని కనికరిస్తారో అర్ధం కాకుండా ఉంది.
అదే సమయంలో ఎమ్మెల్యే తమ ప్రయత్నాలని మాత్రం విరిమించుకోవడం లేదు...ఎవరికి వారు...శక్తివంచన లేకుండా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో ఎమ్మెల్యేలు బాగా ఆతృతగా ఉన్నారు. ఎందుకంటే ఈ జిల్లాకు మూడు మంత్రి పదవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న విషయం తెలిసిందే. కాపు కోటాలో ఆళ్ళ నాని, ఎస్సీ కోటాలో తానేటి వనిత, రాజుల కోటాలో శ్రీరంగనాథ రాజు మంత్రులుగా ఉన్నారు....ఈ ముగ్గురుని ఖచ్చితంగా పక్కనబెట్టే అవకాశాలు ఉన్నాయి...అందుకే  ఆ ముగ్గురి స్థానంలో మరొక ముగ్గురు అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు.


అయితే రాజుల కోటలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు మంత్రి పదవి ఖాయమని ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. అటు ఎస్సీ కోటాలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. అయితే ఎన్ని రకాలుగా చూసుకున్న బాలరాజు మంత్రి పదవికి అర్హుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా జగన్ కోసం త్యాగం చేసిన నేత...2012లో ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకొని, మళ్ళీ ఉపఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు.
అయితే మొదట్లోనే బాలరాజుకు మంత్రి పదవి రావాల్సింది...కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో మిస్ అయింది. కానీ  ఈసారి మంత్రి బాలరాజు మంత్రి పదవి కొట్టేయడం ఖాయమని తెలుస్తోంది. మరి కాపుల కోటలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో క్లారిటీ లేదు. ఇప్పటికే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణలు పదవి దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: