తోట కోటలో టీడీపీ జెండా తీసేయడమేనా?

M N Amaleswara rao
రాష్ట్రంలో నాయకులని బట్టి గెలుపోటములు ఆధారపడే నియోజకవర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. అంటే పార్టీల బలాబలాలు బట్టి కాకుండా నాయకుల బలం మీద ఆధారపడి ఫలితాలు వచ్చే నియోజకవర్గాల్లో రామచంద్రాపురం కూడా ఒకటి. ఇక్కడ మొదట నుంచి పిల్లి సుభాష్...తోట త్రిమూర్తులు మధ్య వార్ నడుస్తూ వస్తుంది. పిల్లి ఏమో కాంగ్రెస్ నుంచి...తోట ఏమో టీడీపీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఒకసారి ఒకరు పైచేయి సాధిస్తే...మరొకసారి మరొక నాయకుడు పై చేయి సాధిస్తూ వచ్చారు.


అయితే ఇప్పుడు ఇద్దరు నాయకులు వైసీపీలోనే ఉన్నారు. పైగా ఇద్దరు మండపేటకు వెళ్ళిపోయారు. ఇక రామచంద్రాపురం నియోజకవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ చెల్లుబోయిన ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ తోట వైసీపీలోకి వెళ్ళాక...రామచంద్రాపురంలో టీడీపీ బలం పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఇక్కడ మొదట నుంచి తోట బలం మీదే రామచంద్రాపురంలో గెలుపోటములు ఆధారపడి ఉండేవి.


ఇప్పుడు తోట కూడా సైడ్ అవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్తితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల టీడీపీ ఇంచార్జ్‌గా రెడ్డి సుబ్రహ్మణ్యంని నియమించారు. కానీ ఈయన వల్ల టీడీపీకి పావలా ఉపయోగం లేదనే చెప్పాలి. ఎందుకంటే రెడ్డికి పెద్దగా నియోజకవర్గంపై పట్టు లేదు...పట్టుమని నాలుగు ఓట్లు టీడీపీకి పడేలా చేసుకోలేదు. అసలు చెప్పాలంటే తోట మాదిరిగా రెడ్డికి జనాకర్షణ లేదు. దీని వల్ల నియోజకవర్గంలో టీడీపీ పికప్ అయ్యే పరిస్తితి లేదు. అందుకే ఇక్కడ పూర్తిగా వైసీపీ ఆధిక్యం నడుస్తుందని చెప్పాలి.


ఒకవేళ తోట మళ్ళీ టీడీపీలోకి వస్తే పరిస్తితి మారుతుంది...కానీ తోట టీడీపీలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు...ఆయన వైసీపీలోనే సెట్ అయ్యేలా ఉన్నారు...అలాగే మండపేట బరిలో ఆయన నిలబడేలా ఉన్నారు. కాబట్టి తోట లేకుండా రామచంద్రాపురంలో టీడీపీ బ్రతికి బట్టకట్టడం కష్టం...ఒకవేళ జనసేన ఏమన్నా నెక్స్ట్ సపోర్ట్ ఇస్తే కాస్త బలం వస్తుంది..లేదంటే అంతే సంగతులు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: