గంటా అవుట్...నార్త్-సౌత్‌లు సెట్ చేయకపోతే కష్టమే...

M N Amaleswara rao
గంటా శ్రీనివాసరావు...ఉత్తరాంధ్ర రాజకీయాలని ప్రభావితం చేయగల నాయకుడు....అర్ధ బలం..అంగ బలం పుష్టిగా ఉన్న నేత...అందుకే ఆయన ఎన్ని పార్టీలు మారినా...ఎన్ని సార్లు నియోజకవర్గాలు మారినా ఓడిపోలేదు. అలా ఓటమి ఎరగని నాయకుడుగా ఉన్న గంటా రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది పెద్దగా క్లారిటీ రావడం లేదు. 2019 ఎన్నికల తర్వాత గంటా రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ తరుపున గెలిచిన గంటా...ఆ తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో...సైలెంట్ గా ఉండిపోయారు. ఆఖరికి గెలిపించిన నార్త్ నియోజకవర్గ ప్రజలని కూడా పట్టించుకోవడం లేదు. అసలు గంటా బయట కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు పార్టీ మారిపోతారని ప్రచారం నడిచింది...వైసీపీలోకి వెళ్లిపోతున్నారని టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. కానీ గంటా పార్టీ మాత్రం మారలేదు...అలా అని టీడీపీలో పనిచేయడం లేదు. కాకపోతే గంటా ఎప్పటికైనా పార్టీ మారిపోవడం ఖాయమని టీడీపీ శ్రేణులు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. అందుకే గంటాని టీడీపీ శ్రేణులు అసలు పట్టించుకోవడం లేదు.
తాజాగా టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగినా సరే గంటా మాత్రం బయటకు రాలేదు...అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న టీడీపీ నేతలు సైతం బయటకొచ్చి...చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. కానీ గంటా మాత్రం కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఖండన చేయలేదు. దీని బట్టి చూస్తే గంటా టీడీపీలో లేరని క్లారిటీ వచ్చేసిందని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి.
గంటా సైడ్ అయిపోయారు కాబట్టి, ఆయన గెలిచిన విశాఖ నార్త్‌లో టీడీపీకి సరికొత్త నాయకుడుని ఇంచార్జ్‌గా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరగా ఆ పనిచేస్తే బెటర్ అని లేదంటే నార్త్‌లో టీడీపీ జెండా ఎత్తేయోచ్చని అంటున్నారు. అటు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కూడా వైసీపీలోకి వెళ్లారు కాబట్టి...అక్కడ టీడీపీకి మంచి నాయకుడుని సెట్ చేయాలని కోరుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: