ఆ కంచుకోటలు టీడీపీకి ఈసారి కలిసొస్తాయా?

M N Amaleswara rao
నలభై ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనేక కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కువ సార్లు టీడీపీ జెండా ఎగిరిన నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు కంచుకోటల్లో సైతం టీడీపీ చేతులెత్తేసింది. కానీ ఇప్పుడుప్పుడే ఆ కంచుకోటల్లో టీడీపీ పికప్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలై రెండున్నర ఏళ్ళు కావొస్తున్నాయి..ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలమైన వాతావరణం వస్తుంది.
ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న విజయనగరం అసెంబ్లీ, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో టీడీపీ చాలా వరకు పికప్ అయినట్లే కనిపిస్తోంది. అసలు విజయనగరం టీడీపీకి పెద్ద కంచుకోట...అందులోనూ అశోక్ గజపతిరాజుకు పెట్టని కోట. ఇక్కడ టీడీపీదే ఎక్కువసార్లు విజయం 1983 నుంచి చూసుకుంటే 2014 వరకు టీడీపీ జెండా ఎక్కువసార్లు ఎగిరింది. కేవలం 2004 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. 1983 నుంచి 2009 వరకు అశోక్ గజపతి రాజు టీడీపీ తరుపున గెలుస్తూ వచ్చారు.


2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున మీసాల గీత పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో అశోక్ తనయురాలు...అతిథి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ రెండున్నర ఏళ్లలో విజయనగరంలో టీడీపీ చాలా వరకు పుంజుకుంది. ఇక్కడ వైసీపీకి కూడా అనుకూల వాతావరణం తగ్గుతుంది. టీడీపీకి అనుకూలంగా రాజకీయం మారుతుంది.
అటు శృంగవరపుకోట కూడా టీడీపీకి అతి పెద్ద కంచుకోట... 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 2004 ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి ఇక్కడ వైసీపీ జెండా ఎగిరింది. కానీ ఈ రెండున్నర ఏళ్లలోనే పరిస్తితి మారిపోయింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే టీడీపీకి అతి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. మొత్తానికి విజయనగరం, శృంగవరపుకోటల్లో టీడీపీ ఫుల్ గా పికప్ అయిందనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: