హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు ఇంకో ఛాన్స్ లేదా!

M N Amaleswara rao
రాజకీయాల్లో ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు...ఏళ్ల తరబడి ఒక పార్టీలో పనిచేసిన నాయకుడు....తన అవసరానికి తగ్గట్టు పార్టీ మారి రాజకీయం చేయొచ్చు...అలాగే అనూహ్యంగా వరుస విజయాలు అందుకోవచ్చు...అయితే పరిస్తితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కాబట్టి అలాంటి నాయకులకు ఎదురుగాలులు వీచే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా ఎదురుగాలి ఎదురుకుంటున్న వారిలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి కూడా ఒకరని చెప్పొచ్చు. ఈయన రాజకీయ జీవితం టీడీపీలోనే మొదలైంది.
1985లో తొలిసారి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు...ఇక 1989, 1994 ఎన్నికల్లో ఓడిపోగా, 1999 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఆ తర్వాత శెట్టిపల్లి తన నిర్ణయం మార్చుకుని వైసీపీలోకి జంప్ కొట్టారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచేశారు. టీడీపీ తరుపున పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేసి వరుసగా ఓడిపోతూ వచ్చారు.   అయితే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిపల్లి వల్ల మైదుకూరులో పెద్దగా అద్భుతాలు ఏమి జరగడం లేదు.


ఏదో ప్రభుత్వం తరుపున సంక్షేమ కార్యక్రమాలు..కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్ప మైదుకూరులో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగడం లేదు..ఇక్కడ రోడ్ల పరిస్తితి కాస్త దారుణంగానే ఉంది...అటు తాగునీరు సమస్యలు కూడా ఎక్కువే. ఈ సమస్యలతో పాటు ఎమ్మెల్యే పనితీరు కూడా అంతగా బాగోకపోవడం వల్ల మైదుకూరులో వైసీపీకి కాస్త కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు.


ఆ కష్టాలు మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో కనబడింది...మున్సిపాలిటీలో టీడీపీ ఎక్కువ వార్డులు గెలుచుకుంది. కానీ అధికారంలో ఉండటంతో మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసేసుకుంది. అటు ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో సైతం టీడీపీ పర్వాలేదనిపించేలా స్థానాలు గెలుచుకుంది. ఇక ఇక్కడ సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి....ఈ మధ్య బయటకొచ్చి వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ కోసం పనిచేశారు...ఇప్పుడు అదే డీఎల్ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు...ఈ పరిస్తితిని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో శెట్టిపల్లి ఇంకో ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: