మీడియా ముందుకు చంద్రబాబు...!

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ లో సమూల మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నా సరే జరుగుతున్న తప్పులు మాత్రం వివాదాస్పదంగా మారుతున్నాయి. టీడీపీ ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేసే పరిస్థితి. విద్యా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా వినపడుతుంది. ఇక విద్యా వ్యవస్థ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. బడిలో ఉండాల్సిన విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బజారున పడేశారు అని ఆయన ఆరోపించారు.
అమ్మఒడి ఎవరు అడిగారు.. మా బడులు మాకు కావాలని విద్యార్థులు కోరుతున్నారు అని అన్నారు ఆయన. విద్యార్థుల విన్నపాలను అర్థం చేసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఎయిడెడ్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యా వ్యవస్థ మనుగడకు గొడ్డలిపెట్టు అని విమర్శలు చేసారు. ఆస్తులు అప్పగించని ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే పోరాటం తప్పదు అని ఆయన హెచ్చరించారు.
విద్యార్థుల జీవితాలతో పాలకులు ఆడుకోవడం మంచిదికాదు అని ఆయన హితవు పలికారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీవో.42ను రద్దు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మధ్యలో ఉండగా.. ప్రభుత్వం విలీనం నిర్ణయం చేయడం విద్యార్థుల భవిష్యత్ ను అంధకారం చేయడమే అని అన్నారు ఆయన. ప్రభుత్వ సాయాన్ని నిలిపేయడం వల్ల ఆ భారం పేద విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఫీజులు కట్టలేక అర్థాంతరంగా చదువులు నిలిచిపోయే ప్రమాదం వుంది అని తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను, సిబ్బంది జీవితాలను ఇబ్బందులకు గురిచేయడం మంచిదికాదు అని అన్నారు. లేదంటే తల్లిదండ్రులు, విద్యార్థుల పక్షాన పెద్దఎత్తున పోరాటం తప్పదు అని  చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: