బ‌ద్వేల్ బెట్టింగ్స్‌: వైసీపీ మెజార్టీ ఎంత‌... బీజేపీకి ఎన్ని ఓట్లు..!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లో బద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. రేప‌టితో ప్ర‌చార గ‌డువు ముగుస్తుంది. ఇక్క‌డ గెలుపు ఎవ‌రిది ? అన్న దానిపై అంద‌రికి ఇప్ప‌టికే ఓ క్లారిటీ ఉంది. అధికార వైసీపీ వ‌న్ సైడ్ గా గెలిచేస్తోంది. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన దివంగ‌త మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి డాక్ట‌ర్ సుధ గెలుపు పై ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఇప్పుడు ఆ పార్టీ క్యాండెట్ ఎంత మెజార్టీతో గెలుస్తారు ? ఇక్క‌డ రెండో స్థానంలో బీజేపీ ఉంటుందా ? కాంగ్రెస్ ఉంటుందా ? బీజేపీకి ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌నే దానిపై ఇక్క‌డ ప్ర‌ధానంగా బెట్టింగ్ లు న‌డుస్తున్నాయి.
వైసీపీ వాళ్లు త‌మ పార్టీ కి వ‌చ్చే మెజార్టీ మీద బెట్టింగులు క‌డుతున్నారు. ఇక బీజేపీ వాళ్ల‌కు గెలుపు ఆశ‌లు ఎలాగూ లేవు.. ఉండ‌వు కూడా..  అందుకే  బీజేపీ నేత‌లు త‌మ పార్టీ సాధించే ఓట్ల‌పైనే పందెం క‌డుతున్నారు. విచిత్రం ఏంటంటే బీజేపీ అగ్ర నేత‌లు ఇక్క‌డ మ‌కాం వేసి మ‌రీ గ‌ట్టిగా ప్ర‌చారం చేశారు. ఇక కాంగ్రెస్ ఇక్క‌డ పోటీలో ఉన్నా అది మొక్కుబ‌డే అంటున్నారు. ఆ పార్టీ నుంచి ఇక్క‌డ 2009 లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే క‌మల‌మ్మ పోటీ చేస్తున్నారు.
ఇక బీజేపీ వాళ్లు అయితే త‌మ పార్టీ అభ్య‌ర్థికి ఇక్క‌డ 18,500 ఓట్ల‌కు పైనే వ‌స్తాయ‌ని పందేలు కాస్తున్నారు. ఇక వైసీపీ వాళ్లు అయితే వైసీపీకి 80 వేల మెజార్టీ వ‌స్తుంద‌ని భారీగా పందేలు క‌డుతున్నారు. క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల మ‌డుగు - ప్రొద్దుటూరు కేంద్రాలుగా ఈ బెట్టింగ్‌లు న‌డుస్తున్నాయంటున్నారు. ఇక తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో వైసీపీకి 4 ల‌క్ష‌ల మెజార్టీ రాద‌ని బీజేపీకి చెందిన ఓ మాజీ మంత్రి బెట్టింగ్ కాసి ఏకంగా రు. 5 కోట్లు గెలుపొందార‌ట‌. ఇప్పుడు ఆయ‌న కూడా ఇక్క‌డ బీజేపీకి 18500 ఓట్లు వ‌స్తాయ‌ని పందేలు కాస్తున్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: