కాశ్మీర్ లో కొత్త ప్లాన్.. ఇక ఉగ్రవాదుల ఆటలు సాగవు?

praveen
భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో ఎప్పుడు వాతావరణం హాట్ హాట్ గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భారత్ కి శత్రు దేశమైన పాకిస్థాన్ నుంచి ఎప్పుడూ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అంతే కాదు సరిహద్దుల్లో ఉన్న పాకిస్థాన్ సైన్యం అప్పుడప్పుడు కాల్పులకు తెగబడుతూ ఉంటుంది.  ఇలాంటి సమయంలో గత కొన్ని నెలల నుంచి భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదుల ఆటలు ఎక్కడ సాగనివ్వం లేదు.

 ఎక్కడికక్కడ ఎంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ ఉగ్రవాదులను ఏరివేసేందుకు వివిధ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే గత కొన్ని నెలల నుంచి ఏకంగా వందల మంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసింది భారత ఆర్మీ. అయితే 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఎంతో ప్రశాంతంగా మారిన కాశ్మీర్ లో మరోసారి కల్లోల పరిస్థితులు సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు  ఈ క్రమంలోనే కాశ్మీర్లో ఉన్న కొంతమంది నేతలు రాజకీయ నాయకులు పోలీసుల పై కూడా కాల్పులు జరుగుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే అటు భారత ఆర్మీ అప్రమత్తమైంది. ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఉగ్రవాదులను మట్టుబెడుతుంది.

 కాగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్థాన్ లో జరుగుతున్న పరిణామాలపై సీరియస్గానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక కాశ్మీర్ ప్రాంతం మొత్తం ప్రత్యేకంగా డ్రోన్ల నిఘా నీడలో కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసారట. తద్వారా ఎప్పటికప్పుడు కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు.  కాగా ఇప్పటికే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి మట్టు పెడుతుంది భారత సైన్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: