నాకూ టిపిసిసి రావడానికి.. కెసిఆరే కారణం : రేవంత్

praveen
ఒకప్పుడు తిరుగులేని చరిష్మాతో కొనసాగి తెలుగు రాష్ట్రాలలో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం రోజురోజుకూ బలం కోల్పోతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.  కనీస ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు కూడా సంపాదించుకోలేక పోతుంది కాంగ్రెస్ పార్టీ. అంతే కాదు అటు కెసిఆర్ ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి అసలుసిసలైన నాయకుడు లేడు అని ఎంతో మంది కార్యకర్తలు కూడా భయపడ్డారు. ఇలాంటి సమయంలో అటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చాడు అనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ లోకి వచ్చినప్పటి నుంచి ఎంతో దూకుడు గాని ముందుకు సాగుతున్నారు.

 ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేయడం ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెచ్చి ఏకంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయారు రేవంత్ రెడ్డి. దీంతో కేసీఆర్ ను ఎదుర్కొనే అసలు సిసలైన నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే అని తెలుగు ప్రజలందరి లో కూడా ఒక భావన కలిగించారు. ఇక తన ప్రసంగాలతో.. తన విమర్శలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అనే మారిపోయారు రేవంత్ రెడ్డి.  అయితే ఇటీవలే రేవంత్ రెడ్డి ఏకంగా టీ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వడం అందరికీ షాక్ కి గురిచేసింది.

 అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడం పై కొంత మంది సీనియర్లు మొదట్లో వ్యతిరేక స్వరాలు కూడా వినిపించారు. కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకు పోవడం తో తాము కూడా రేవంత్ రెడ్డి వెంటే పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాము అని తెలిపారు. అయితే ఇటీవల యూట్యూబ్లో ఇంటర్వ్యూ కి హాజరైన రేవంత్ రెడ్డి తనకు టిపిసిసి పదవి రావడానికి కేసీఆర్ కారణం అంటూ చెప్పాడు.  కెసిఆర్ నన్ను టార్గెట్ చేసి పదే పదే జైలుకు పంపించడం.. నా మీద  అసత్య ఆరోపణలు చేస్తూ కేసు పెట్టించడం.. ఇలా టార్గెట్ వల్ల ప్రజల దృష్టి మొత్తం తన మీదికి వచ్చిందని ఇక మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోయానని.. ఇక ఇలాంటివి జరగడం కారణంగానే తనకు టిపిసిసి వచ్చిందని కూడా ఒక భావన ఉంది అంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఇలా కేసీఆర్ ఈ కారణంగానే తనకు టిపిసిసి వచ్చింది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: