త్వ‌ర‌లో 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి..? ష‌బీర్ అలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన ఏడేండ్ల కాలంలో తొలిసారిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు స‌వాలుగా జ‌రుగుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోరుకు ఎన‌లేని ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.  అధికార టీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీలు ప్ర‌చారాన్ని హోరాహోరీగా కొన‌సాగిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంలో ఆల‌స్యం చేసినా.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ప్ర‌చారంలో దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇటీవ‌ల బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగ‌ల‌ని, రెండు పార్టీల‌కు క‌లిసి ఉమ్మ‌డి అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ అని, ఈట‌ల‌, రేవంత్‌రెడ్డిల మ‌ధ్య ర‌హ‌స్య భేటీ గోల్కొండ వ‌ద్ద రిసార్ట్‌లో జ‌రిగింద‌ని ఆరోపించిన విష‌యం విధిత‌మే.
దీనిపై రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌లు ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా మేము క‌లువ‌లేదు. అది మే నెల‌లో ఓ సంద‌ర్భంగా క‌లిశాం. క‌లిసిన మాట వాస్త‌వ‌మే. క‌లిస్తే ఏమిటంట అని స‌మాధానం ఇచ్చారు. అందుకు వీరిరువురూ కేటీఆర్ పై మండిప‌డ్డారు. ఇది ఇలా ఉండ‌గానే కాంగ్రెస్ నేత‌లు స‌రికొత్త ప్ర‌చారాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసిన వెంట‌నే దాదాపు 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేర‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని.. మాజీ మంత్రి, టీపీసీసీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ క‌న్వీన‌ర్ ష‌బ్బీర్ అలీ బాంబు పేల్చారు. టీఆర్ఎస్‌కు గుణ‌పాఠం చెప్పేందుకు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌య్యార‌ని, టీఆర్ఎస్ నాయ‌కులు పిచ్చిప‌ట్టిన‌ట్టు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితిని అర్థం చేసుకొని కొంద‌రూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడ‌బోతున్నార‌ని జోస్యం చెప్పారు.
రేవంత్‌రెడ్డి, ఈట‌ల భేటీని గాంధీభ‌వ‌న్‌లో గాడ్సేగా టీఆర్ఎస్ ప్ర‌చారం చేస్తున్న త‌రుణంలో..ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో తెలంగాణ ద్రోహులు అంటూ కాంగ్రెస్ అందుకు కౌంట‌ర్ వేస్తోంది. అదేవిధంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో గాడ్సే కొత్త అవ‌తారంగా విశ్రాంతి తీసుకొంటుంది. గాడ్సెకు పెద్ద శిష్యుడు లాంటి అమిత్‌షాను త‌రుచూ కేసీఆర్ ఎందుకు క‌లుస్తున్నారో స‌మాధానం చెప్పాల‌ని ష‌బ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈట‌ల‌, రేవంత్‌రెడ్డి భేటీపై కేటీఆర్ గాలి మాట‌లు మాట్లాడార‌ని సీఎల్పీనేత భ‌ట్టివిక్ర‌మార్క వెల్ల‌డించాడు. కాంగ్రెస్‌, బీజేపీలు ఎప్ప‌టికీ క‌ల‌వ‌బోవ‌ని, గాంధీభ‌వ‌న్‌లో గాడ్సేల‌కు స్థానం లేద‌ని స్ప‌ష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నిక త‌రువాత ఈట‌ల కాంగ్రెస్‌లో చేరుతార‌నే వార్త అస‌త్యం అని భ‌ట్టి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: