సోమిరెడ్డిని బాబు ఇక భ‌రించ‌లేన‌న్నారా... కొత్త‌గా చెక్‌..!

VUYYURU SUBHASH
సీనియ‌ర్ నేత , టీడీపీ కి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ పోరాటం మామూలు ది కాదు. నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి లో రాజ‌కీయాలు మొద‌లు పెట్టిన ఆయ‌న గెలుపు అన్న మాట‌ను అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం త‌ర్వాత పూర్తి గా మ‌ర‌చిపోయారు. ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పోటీ చేయ‌డం.. గెలుస్తార‌ని ఎన్నో ఆశ‌ల‌తో వెయిట్ చేయ‌డం చంద్ర‌బాబు కు కామ‌న్ గా మారిపోయింది. 2004 - 2009 - 2012 ఉప ఎన్నిక - 2014 - 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న వ‌రుస‌గా ఓడిపోతూనే ఉన్నారు.
గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. అప్పుడు చంద్ర‌బాబు సోమి రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మ‌రీ మంత్రిని చేశారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి వదులుకుని మ‌రీ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఐదోసారి ఓడిపోయారు. అయితే ఈ సారి మాత్రం ఆయ‌న స‌ర్వేప‌ల్లికి బై బై చెప్ప‌క త‌ప్ప‌ద‌నే అంటున్నారు. ఈ సారి సోమిరెడ్డిని బాబు తెలి విగా వ‌దిలించుకు నే ప్లాన్ వేశార‌ట‌.
ఆయ‌న్ను ఈ సారి నెల్లూరు జిల్లా నుంచే బ‌య‌ట‌కు పంపించే ప్లాన్ జ‌రుగుతోంద‌ని టాక్ ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో సోమిరెడ్డిని ఒంగోలు ఎంపీ గా పోటీ చేయించాల‌ని బాబు భావిస్తున్నార‌ట‌. 1999లో క‌మ్మ వ‌ర్గానికి చెందిన కరణం బలరాం తప్ప దాదాపు మూడు దశాబ్దాలుగా ఒంగోలు పార్లమెంటుకు రెడ్డి సామాజికవర్గం వారే ఎంపీలుగా ఉంటున్నారు. ఇక ఇక్క‌డ పార్ల‌మెంటు సీటును టీడీపీ కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే గెలిచింది. అందులో 1984లో బెజవాడ పాపిరెడ్డి, 1999లో కరణం బలరాం గెలిచాక మ‌ళ్లీ ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌ర‌లేదు.
ఈ సారి సోమిరెడ్డి ఏపీ రాజ‌కీయాల‌కు కాకుండా పార్ల‌మెంటు కు పంపించి.. ఇక్క‌డ వ‌దిలించుకునే క్ర‌మంలోనే బాబు ఆయ‌న్ను ఒంగోలు పార్ల‌మెంటు బ‌రిలో దింపాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: