అదే జ‌రిగితే జ‌గ‌న్ త‌లాక్ చెప్పేస్తాడా..!

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పరిణామాలపై చాలా సీరియ‌స్ గానే కాన్ సంట్రేష‌న్ చేస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. బీజేపీ నేతలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు ? అనే దానిపైనే జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యం ఆధా ర‌ప‌డి ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు లేక‌పోయినా కూడా జ‌గ‌న్ మాత్రం బీజేపీ పై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. కేంద్ర ప్ర‌భుత్వానికి ఎప్పుడూ కూడా సహాయం చేసే ధోర‌ణి తోనే ముందుకు సాగుతున్నాడు.

అయితే ఇప్పుడు ఢిల్లీలో జ‌రి గే పరిణామా ల తర్వాత జగన్ తన నిర్ణయం తీసుకునే అవకాశముంద‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అవసరమైతే బీజేపీ కి పూర్తిగా దూరం జరగడానికి కూడా జగన్ ఏ మాత్రం వెనుకాడే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. త‌న‌ను అన్ని విధాలా ఇబ్బంది పెడుతోన్న చంద్ర‌బాబు కు బీజేపీ ఏ మాత్రం స‌హాయం చేసిన‌ట్టు జ‌గ‌న్ కు అనిపించినా ఇక బీజేపీ తో మెత‌క ధోర‌ణి తో ముందుకు వెళ్ల‌డం ఏ మాత్రం మంచిది కాద‌ని జ‌గ‌న్ డిసైడ్ అయిపోయార‌ట‌.

చంద్రబాబు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. రాష్ట్ర ప‌తి అపాయింట్ మెంట్ ఖ‌రారు కావ‌డంతో బాబు రాష్ట్ర‌ప‌తిని కూడా క‌ల‌వ నున్నారు. ఇక ప్ర‌ధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం బాబు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్క‌రు అయినా బాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చినా కూడా బీజేపీ పై త‌న విధానాన్ని జ‌గ‌న్ పూర్తిగా మార్చుకుంటార‌నే అంటున్నారు.

త‌న అవ‌స‌ర‌మే బీజేపీ కి ఎక్కువ ఉంటుంద‌ని.. ఎప్ప‌ట‌కి అయినా బీజేపీ దిగిరాక త‌ప్ప‌ద‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యార‌ట‌. అందుకే బాబుకు ఏ మాత్రం ప్ర‌యార్టీ ఇచ్చిన‌ట్టు అనిపించినా బీజేపీ పై కూడా ఇక నుంచి మ‌మ‌తా బెన‌ర్జీలా దూకుడుగానే వెళ్లాల‌ని ఆయ‌న డిసైడ్ అయిపోయార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: