కేటీఆర్ పై ఈట‌ల రివ‌ర్స్ అటాక్‌..?

Paloji Vinay
హుజురాబాద్ ఉప ఎన్నిక స‌మ‌రం తారా స్థాయికి చేరుకుంది. ఈ నెల 27తో ప్ర‌చార ప‌ర్వాన‌కి ముగింపు ప‌డ‌నుంది. దీంతో ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖులు నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు మండ‌లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. హుజురాబాద్ ప‌ట్టణం మొద‌లుకుని మారుమూల ప‌ల్లెల్లోని వీధివిధినా ప్ర‌చారా హోరు వినిపిస్తోంది. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు రోడ్ షో నిర్వ‌హిస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నారు. రెండు చేతులు జోడించి గెలిపించ‌మ‌ని అభ్య‌ర్థిస్తున్నారు. ఆల‌స్యంగా ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారాన్ని తీవ్రం చేసింది. రెండు అధికార పార్టీల‌పై వాడీవేడీగా ఆరోప‌ణ‌లు చేస్తూ విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పిస్తోంది.

 మోడీ కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను స‌మ‌ర్త‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వ‌లేదు. మోడీ సర్కార్ పేద‌ల బ్యాంకు ఖాతాల్లో 15 ల‌క్ష‌లు వేస్తానని వేయ‌లేదు అని ఓట‌ర్ల‌కు గుర్తు చేస్తున్నారు. అలాగే, పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌ను కూడా కాంగ్రెస్ త‌న ప్ర‌చారంలో ఆయుధాలుగా మార్చుకుంది. అయితే, కాంగ్రెస్ ఎంత ప్ర‌చారం చేస్తున్నా.. బీజేపీ, టీఆర్ఎస్ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

అదే స‌మ‌యంలో ఆ పార్టీ ద్వారా ల‌బ్ది పొందే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మ‌క్యయ్యాయ‌ని ఆ రెండు పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఈట‌ల రాజేంద‌ర్ పోటీ చేస్తున్నాడ‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, ఈట‌ల రాజంద‌ర్ టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు ర‌హ‌స్యంగా క‌లుసుకున్నారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని చెప్పారు.

ఇక దీనిని ఈట‌ల రాజేంద‌ర్ త‌నదైన శైలీలో బ‌దులిచ్చారు. రేవంత్ రెడ్డిని క‌లిసిన మాట వాస్త‌వ‌మే కానీ, ఇప్పుడు కాదు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌రువాత చాలా మందిని క‌లిసాన‌ని ఇందులో భాగంగా రేవంత్ రెడ్డిని క‌లిశాన‌ని చెప్పారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అంద‌రినీ క‌ల‌వ‌లేదా..? అని అభివృద్ధి కోసం క‌లిస్తే త‌ప్పేంటి అని ప్ర‌శ్నించారు. హుజురాబాద్‌లో రేవంత్‌ను బూచీగా చూపి టీఆర్ఎస్ గెల‌వాల‌ని చూస్తుంటే. రేవంత్ ఓటు బ్యాంకుతో బీజేపీ గెల‌వాల‌ని బీజేపీ చూస్తున్నట్టుగా క‌నిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: