బుర్జ్ ఖ‌లీఫాపై "బ‌తుక‌మ్మ" వైభ‌వం

N ANJANEYULU
ఆకాశ దేశాన ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖ‌లీఫాపై బ‌తుక‌మ్మ‌, కేసీఆర్‌, తెలంగాణ చిత్ర‌ప‌టాలు  ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌పంచ ప్ర‌సిద్ధ వాణిజ్య వాణిజ్య ప‌ర్యాట‌క కేంద్ర‌మైన దుబ‌యికి క‌లికితురాయి లాంటి బుర్జ్ ఖ‌లిఫా భ‌వ‌నం తెలంగాణ పండుగ సంబ‌రానికి వేదిక అయింది. బ‌తుక‌మ్మ ఖ్యాతి ఖండాంత‌రాలు దాటింది. ఎడారిదేశంలో సైతం తండెడు వ‌నాలు విర‌బూసింది. భార‌త‌దేశంలోని నూత‌న రాష్ట్రాల‌లో ఒక‌టైన తెలంగాణ కీర్తికాంతుల‌ను ప్ర‌పంచ ప్ర‌జ‌ల ముందు అద్భుత దృశ్యంగా ఆవిష్క‌రించింది.
 దుబ్బాయ్ లోని  ఎత్తైనా  "బుర్జ్ ఖలీఫా" పై తెలంగాణ పండుగ అయిన బ‌తుక‌మ్మ పండుగ వేడుక‌లు నిర్వ‌హించారు. పువ్వుల పండుగ గొప్ప‌త‌నాన్ని వీడియో ద్వారా ప్ర‌పంచానికి చాటిచెప్పారు. ఈ వీడియోను రెండుసార్లు ప్ర‌ద‌ర్శించారు. బ‌తుక‌మ్మ విశిష్ట‌త‌, తెలంగాణ సంస్కృతిని తెలిపేలా వీడియోలో తెలిపారు. బుర్జ్ ఖ‌లిఫాపై ప్ర‌త్యేకంగా వ్య‌క్తుల ఫోటోల‌ను లేజర్ షోలో ప్ర‌ద‌ర్శించ‌టం చాలా అరుదు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హాత్మ‌గాంధీ, బాలీవుడ్ న‌టుడు షారుఖ్‌ఖాన్ చిత్రాల‌ను మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించారు. ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ నిలిచారు. రంగు రంగు పువ్వులతో బ‌తుక‌మ్మ ఖ‌లిఫాపై క‌నిపించ‌గానే ప్ర‌వాస తెలంగాణ వాసులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. బుర్జ్ ఖ‌లిఫాపై బ‌తుక‌మ్మ‌ను ప్ర‌ద‌ర్శించ‌డం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని, ఇందుకు స‌హ‌క‌రించిన యూఏఈ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు ఎమ్మెల్సీ క‌విత‌.
తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బ‌తుక‌మ్మ‌ను విశ్వ‌వేదిక‌పై మూడు నిమిషాల‌పాటు ప్ర‌ద‌ర్శ‌న చేశారు. యూఏఈ  ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు, పారిశ్రామిక‌వేత్త‌లు, వివిధ దేశాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు బ‌తుక‌మ్మ‌ను ఎంతో ఆస‌క్తిగా తిల‌కించారు. బుర్జ్ ఖ‌లిఫాపై బ‌తుక‌మ్మ‌ను ప్ర‌ద‌ర్శించ‌డం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశానికి కూడ ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ఎమ్మెల్సీ క‌విత తెలిపారు. తొలుత లేజ‌ర్ షో ప్రారంభం కాగానే బుర్జ్ ఖ‌లీఫాపై ఎనిమిది రంగుల్లో బ‌తుక‌క‌మ్మ‌ను ఆవిష్క‌రించారు. ఖ‌లీఫా మొత్తం రంగులమ‌యం అయింది. ఆ త‌రువాత తెలుగు, ఇంగ్లీషు, అర‌బ్బీ మూడు భాష‌ల్లో బ‌తుక‌మ్మ పేరును ప్ర‌ద‌ర్శించారు.  అనంత‌రం తెలంగాణ రాష్ట్రం చిత్రాన్ని ఆవిష్క‌రించారు. వెంట‌నే కేసీఆర్ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. అదేవిధంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన తెలంగాన జాగృతిపేరును, జ్యోతిని ప్ర‌ద‌ర్శించారు. లేజ‌ర్ షో జ‌రుగుతున్న‌ప్పుడు ఏఆర్ రెహ‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన అల్లీపూల బ‌తుక‌మ్మ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించింది. లేజ‌ర్ షో జ‌రుగుతున్నంత సేపు బుర్జ్ ఖ‌లీఫా చుట్టుప‌క్క‌ల జైతెలంగాణ నినాదాలు, కేరింత‌లు, చ‌ప్ప‌ట్ల‌తో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: