స్వదేశీ కొనసాగితే.. చైనాను దెబ్బకొట్టినట్టే..!

Chandrasekhar Reddy
భారత్ స్వదేశీ ఉత్పత్తిని చేసుకోవడం ద్వారా చైనాను వీలైనంత త్వరగా దాటేయొచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఇది రానున్న పది పదిహేను ఏళ్లపాటు సంకల్పంగా కొనసాగితే మాత్రం భారత జీడీపీ చైనా ను మించిపోగలదు. ఈ స్థితికి ఎదగడానికి చైనా నుండి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్, వస్త్రాలు, స్టీల్, ఔషదాలు, ఆయుధాలు వంటివి భారత్ స్వయంగా ఉత్పత్తి చేసుకోవడం తప్పనిసరి. అదికూడా దాదాపుగా రెండు దశాబ్దాలైనా ఈ పరిస్థితి క్షుణ్ణంగా కొనసాగితేనే సాధ్యం. అప్పుడే ఆసియాలో జీడీపీలో మొదటి స్థానంలో ఉన్న చైనా ను భారత్ పక్కకు నెట్టేసి, ఆ స్థానాన్ని ఆక్రమించగలదు. అందుకు భారత్ కూడా విశేష కృషి ఆరంభించింది. ఈ విధమైన అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి.
ఈవిధమైన ప్రణాళిక ప్రకారం భారత్ ముందుకు వెళుతుంటే, చైనా కు దాదాపుగా 40 శాతం వరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని భారత్ కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధం అవుతుంది. అందుకే ప్రధాని మోడీ కూడా స్వయం సేవక్ అంటూ స్వదేశీ ఉత్పత్తిని పెంపొందించే ప్రణాళికలు రచిస్తున్నారు. దానికి తగ్గట్టే యువతను ప్రోత్సహించి, స్టార్ట్ అప్ లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా సమయంలోనే అనేక సంస్థలు ఈ మేరకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే వాక్సిన్ భారత్ లో ఉత్పత్తి చేయగలిగింది. ఇలా భారత్ మరో రెండు దశాబ్దాలు ఆయా రంగాలలో స్వదేశీ ఉత్పత్తిని చేసుకోగలిగితే చైనా ను శాశ్వతంగా పక్కను నెట్టేయొచ్చు.
ప్రస్తుతం చైనా జీడీపీ 16642 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో జపాన్ జీడీపీ 5375 బిలియన్ డాలర్లు గా ఉంది, ఇక మూడో స్థానంలో భారత్ జీడీపీ 3049 బిలియన్ డాలర్లతో ఉండగా, సౌత్ కొరియా 1806 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇదంతా ఆసియా జీడీపీ లెక్కల ప్రకారం. ఇప్ప్పుడే మొదటి సారి భారత్ తాను వెళ్లాల్సిన దారిలో వెళ్తుంది. ఎప్పుడో రావాల్సిన ఈ పరిణామం మొత్తానికి ఇప్పటికి వచ్చింది. ఎప్పటికైనా అత్యధిక జనాభా ఉన్న దేశాలలో స్వీయ ఉత్పత్తి ఎంతగానో ప్రధానమైన విషయం. ఒకరిమీద ఆధారపడితే, ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే, బాధితుల సంఖ్య తీవ్రంగా ఉంటుంది కాబట్టి స్వీయ ఉత్పత్తి భారత్ కు శ్రేష్ఠమైన దారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: