బద్వేలు ఉపపోరు: సోము ఎందుకు హడావిడి?

M N Amaleswara rao
అందరిదీ ఒక దారి అయితే రాష్ట్రంలో బీజేపీది ఒక దారి. రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎలాంటి రచ్చ జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ రచ్చ వల్ల రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ పక్కకుపోయాయి...ఆ రెండు పార్టీల రాజకీయం వల్ల ప్రజలు నష్టపోయే పరిస్తితి వచ్చింది. ఇక ఇలాంటి సమయంలో రాష్ట్రంలో పరిస్తితులని చక్కదిద్ది, రాష్ట్రానికి సాయం చేయాల్సిన బీజేపీ మాత్రం...తమ రాజకీయం తమదే అన్నట్లు ఉంది.
ఎలాగో రాష్ట్రంలో బీజేపీకి పెద్ద సీన్ లేదు. అలాంటప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏమన్నా రాష్ట్రానికి సాయం అందేలా చేస్తే పరిస్తితి వేరుగా ఉంటుంది. కానీ ఆ పని బీజేపీ చేయదు..మీరు మీరు కొట్టుకోండి మమ్మలని ఎంటర్‌టైన్ చేయండి అన్నట్లుగానే బీజేపీ రాజకీయం ఉంటుంది. పైగా గెలవలేని బద్వేలు ఉపఎన్నికపై బాగా సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు హడావిడి చేస్తుంది. అసలు బద్వేలు ఉపఎన్నిక గురించి రాష్ట్ర ప్రజలకు అంత ఐడియా కూడా ఉన్నట్లు లేదు.


ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలాగో పోటీ నుంచి తప్పుకుంది...అటు జనసేన కూడా పోటీ చేయడం లేదు. కానీ ఉపపోరుని ఏకగ్రీవం కానివ్వకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ విషయాన్ని పక్కనబెడితే ఆ ఉపపోరులో బీజేపీ హడావిడి మామూలుగా లేదు. అక్కడ బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో తెలియదు గానీ, ఇక తామే వైసీపీకి పోటీ అని ఫీల్ అయిపోయే పరిస్తితి.
గత ఎన్నికల్లోనే బద్వేలులో బీజేపీకి 700 ఓట్లు పడ్డాయి...మరి ఈ సారి ఎన్ని ఓట్లు తెచ్చుకుని రికార్డు సృష్టిస్తుందో తెలియదు గానీ, తమ గెలుపుని వైసీపీ కుట్ర చేసి అడ్డుకుంటుందన్నట్లుగా బీజేపీ ప్రచారం చేసేస్తుంది. అలాగే సోము వీర్రాజు..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం పెట్టి, వైసీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఒత్తిడి తెచ్చారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొత్తానికైతే బద్వేలు ఉపపోరులో బీజేపీ మాత్రం బాగానే హడావిడి చేస్తుంది...మరి చివరికి ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుందో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: