బాబు ఆర్తనాదాలు...కల్యాణ్ బాబు కోసమేనా?

M N Amaleswara rao
నలభై ఏళ్ల పైనే రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు...మూడుసార్లు ముఖ్యమంత్రిగా...మూడోసారి ప్రతిపక్ష నాయకుడుగా పనిచేస్తున్న నేత చంద్రబాబు. దేశ రాజకీయాల్లోనే కీలక నాయకుడు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత హిస్టరీ ఉన్న నాయకుడు మరొకరు లేరు. అలాంటి నాయకుడు తన రాజకీయ అనుభవం అంత వయసు లేని నాయకుడుకు భయపడుతున్నారు. అలాంటి నాయకుడుని ఢీకొట్టలేని స్థితిలో ఉండిపోతూ..చిన్నాచితక పార్టీల సాయం కోసం చూస్తున్నారు.
తాను రాజకీయాల మొదలుపెట్టినప్పుడు జగన్ పాలపీక తాగుతున్నారని చంద్రబాబే స్వయంగా మాట్లాడారు. జగన్ నిక్కర్ వేసుకుని తిరిగే రోజుల్లో చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నారు. అలాంటిది ఇప్పుడు జగనే...బాబుకు చుక్కలు చూపిస్తున్నారు. అసలు బాబు కూడా ఊహించి ఉండరు...తన స్నేహితుడు వైఎస్సార్ తనయుడు జగన్...తనకే చుక్కలు చూపిస్తారని కలలో కూడా అనుకుని ఉండరు. కానీ అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.
వైఎస్సార్ తర్వాత బాబుకు గట్టి ప్రత్యర్ధిగా ఉన్నది జగనే. 2014 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన సరే 2019 ఎన్నికల్లో బాబుకు బొమ్మ చూపించారు. చరిత్రలో ఎప్పుడూలేని ఓటమిని బాబు చూపించారు. బాబుని వైఎస్సార్ రెండుసార్లు ప్రతిపక్షానికి పరిమితం చేస్తే, జగన్ మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.


ఇక 2019 ఎన్నికల నుంచి బాబుకు చుక్కలు కనబడుతూనే ఉన్నాయి...ఏ కోశాన కూడా జగన్‌కు బాబు పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఎక్కడకక్కడ తేలిపోతున్నారు. ఈ విషయం బాబుకు అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే బాబు కూడా రాష్ట్రంలోని మిగిలిన పార్టీలు తనకు మద్ధతు ఇవ్వాలని, అందరం కలిసి కట్టుగా పోరాడదామని అంటున్నారు. ఇందులో ప్రధానంగా పవన్ కల్యాణ్ సపోర్ట్ కోసం బాబు తెగ కష్టపడుతున్నారని అర్ధమవుతుంది. కల్యాణ్ బాబు సపోర్ట్ చేస్తే కాస్త జగన్‌కు పోటీ ఇవ్వొచ్చని బాబు ఫీల్ అవుతున్నారు. కానీ బాబు ఎన్ని ఆర్తనాదాలు చేసినా పెద్దగా ఉపయోగం ఉండేలా లేదు. ఎందుకంటే బాబు గురించి తెలిసినవారు ఎవరూ దగ్గరకు రారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: