బొబ్బిలి రాజులు రూట్ మారుస్తారా?

M N Amaleswara rao
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం...ఈ పేరు చెబితే చాలు మొదట గుర్తొచ్చేది...బొబ్బిలి రాజుల వంశస్థులు.. ఆ వంశానికి చెందిన సుజయకృష్ణ రంగారావు..బొబ్బిలి నియోజకవర్గంపై తనదైన ముద్రవేశారు. వరుసగా బొబ్బిలిలో హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే సుజయ వైసీపీలోనే ఉంటే రాజకీయ జీవితం బాగుండేదేమో...2019 ఎన్నికల్లో కూడా మరొకసారి గెలిచి జగన్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యేవారు.
అలా అని పార్టీ జంప్ చేసి మంత్రి కాకుండా ఏమి లేరు. 2014లో గెలిచాక సుజయ అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ చేశారు. అలాగే చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లోనే అంతా రివర్స్ అయింది..టీడీపీ నుంచి బరిలో దిగిన సుజయ అనూహ్యంగా జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక పూర్తిగా రాజకీయాలకు దూరం జరిగారు. ఒకవేళ వైసీపీలో ఉంటే బొబ్బిలిలో నాలుగోసారి గెలిచి, మంత్రి అయ్యేవారు.
కానీ పార్టీ మారి...ఓడిపోయి ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై అడ్రెస్ లేకుండా పోయారు. అయితే సుజయ సోదరుడు బేబీ నాయన బొబ్బిలిలో టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయనే అక్కడ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అటు వైసీపీ తరుపున శంబంగి చిన అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈయన మొదట నుంచి టీడీపీలో పనిచేస్తూ వస్తున్నారు. 1983, 1985, 1994 ఎన్నికల్లో బొబ్బిలిలో టీడీపీ తరుపున గెలిచారు. తర్వాత టీడీపీ తరుపున వరుసగా ఓడిపోయారు.

2009, 2014 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. ఈ క్రమంలోనే వైసీపీలోకి వెళ్ళి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే ఎమ్మెల్యేగా శంబంగికి మంచి మార్కులు పడటం లేదు. ఆయనపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందని సర్వేలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మళ్ళీ బొబ్బిలి రాజులని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి చూడాలి బొబ్బిలి రాజులు మళ్ళీ వైసీపీ వైపు చూస్తారో లేదో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: