తిరుప‌తి సినిమా థియేట‌ర్లో ఘోర ప్ర‌మాదం.. సీట్లు బూడిదే...!

VUYYURU SUBHASH
ఏపీలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ సినిమా థియేటర్‌లో మంటలు చేలరేగి భారీ నష్టం చోటుచేసుకుంది. అయితే అగ్నిమాకప శాఖ వారు ప్ర‌మాద స‌మాచారం అందుకున్న వెంట‌నే స్పందించడంతో మంటలను త్వరలోనే అదుపులోకి వ‌చ్చాయి. తిరుప‌తిలో దివంగ‌త మాజీ నేత భూమా నాగిరెడ్డి కుటుంబానికి రెండు జంట థియేట‌ర్లు ఉన్నాయి. భూమా కాంప్లెక్స్‌లో ఉన్న జగత్ విఖ్యాత్ సినిమా థియేటర్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగ‌డంతో థియేట‌ర్లోని 180 సీట్లు కాలిపోయాయి.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే తిరుప‌తి అగ్ని మాప‌క శాఖ‌కు సమాచారం చేరింది. వారు రంగంలోకి దిగి రెండు ఫైర్ ఇంజ‌న్ల‌తో సంఘ‌ట‌నా స్థ‌లంలోకి వ‌చ్చి మంట‌ల‌ను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణాంత‌రం ఆయ‌న కుమార్తె మాజీ మంత్రి అఖిల ప్రియ, మ‌రో కుమార్తె మౌనిక మ‌ధ్య ఆస్తి గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌న్న ప్ర‌చారం ఉంది.

ఇక అఖిల ప్రియ తెలంగాణ లో త‌మ‌కు ఉన్న ఆస్తుల విష‌యంలో కూడా వివాదంలో చిక్కుకున్నారు. అక్క‌డ ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ తో క‌లిసి కొంద‌రిని కిడ్నాప్ చేసిన కేసులో ఆమె చ‌ర్ల‌ప‌ల్లి జైలులో కూడా కొంత కాలం ఉండి వ‌చ్చారు. ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ వ‌ల్ల కూడా అఖిల తో పాటు భూమా కుటుంబం చాలా వివాదాల్లో చిక్కు కుంటోంది. ఈ ఆస్తి గొడ‌వ‌ల నేప‌థ్యంలో తిరుప‌తిలో ఉన్న ఈ రెండు థియేట‌ర్లు గ‌త యేడాదిన్న‌ర కాలంగా మూత పడి ఉన్నాయి.

థియేట‌ర్ పై ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో ఫైర్ సేఫ్టీ జ‌రిగి ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయలేద‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌మాదంపై థియేట‌ర్ యాజమాన్యంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఫైర్ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: