మంత్రులకు సెండాఫ్ మీటింగ్... ?

Satya
ఏపీలో రాజకీయ వేడి ఒక వైపు రాజుకుంది. మరో వైపు పాలనా పరంగా జగన్ తన పని తాను చేసుకునిపోతున్నారు. ఇంకో వైపు చూస్తే పార్టీపరంగా ప్రభుత్వ పరంగా చక్కదిద్దాల్సిన పరిస్థితులు, చేయాల్సిన మార్పులు కూడా జగన్ చకచకా చేసుకుంటూ సాగుతున్నారు.
ఈ నేపధ్యంలో నవంబర్ నెల ఎంటర్ అవుతోంది. నవంబర్ అంటే తెలిసిందే. ఏపీలో సగం పాలన అప్పటికి  పూర్తి అవుతుంది. 2019 జూన్ 8న జగన్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే నవంబర్ 8కి కచ్చితంగా వారి పదవీకాలం 30 నెలలు పూర్తి అవుతోంది. జగన్ ఇచ్చిన మాట మేరకు మరో ముప్పయి నెలలకు కొత్త మంత్రులు వస్తారు. ఈ నేపధ్యంలో జగన్ మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 28న జరిగే ఈ మీటింగ్ లో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటారు అంటున్నారు.
అదే టైమ్ లో అనేక ఇతర విషయాలు కూడా చర్చకు వస్తాయని అంటున్నారు. ఒక వైపు మంత్రి వర్గ విస్తరణకు టైమ్ డేట్ దగ్గరపడుతున్న వేళ ఇదే చివరి మంత్రివర్గ సమావేశమా అన్న చర్చ కూడా ఉంది. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించాలని భావించారు. ఆ ప్రకారం కొన్నాళ్ళు కధ సాగింది. కరోనా తరువాత మాత్రం ఆ పరిస్థితి లేదు ఇపుడు అయితే గియితే నెలకు ఒక సమావేశం సాగుతోంది. ఈ లెక్కన చూస్తే నవంబర్ లో మరో సారి క్యాబినెట్ మీటింగ్ ఉంటుందా. ఉంటే పాత మంత్రులతో ఉంటుందా లేక కొత్త వారితో ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. ఒక విధంగా ఈ మంత్రివర్గ సమావేశం సెండాఫ్ మీటింగా అన్న మాట కూడా ప్రచారం లో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కధ ఎలా సాగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: