తైవాన్ కు అండగా అమెరికా.. చేయి కాల్చుకుంటున్న చైనా.. !

Chandrasekhar Reddy
కరోనా వైరస్ ప్రపంచానికి అంటించింది చైనా అనే విషయం అన్నిదేశాలు నమ్మినట్టే. అందుకే దానికి దాదాపుగా ఎవరు తోడుగా ఉండటం లేదు. ఎవరు కూడా దానికి గతంలోలాగా వ్యాపార సంబంధాలు కావచ్చు, ఏ ఇతరత్రా ఒప్పందాలను కూడా చేసుకోవడం లేదు. దీనితో చైనా ఒంటరి అని ఉగ్రవాదులకు కూడా అర్ధం అయినట్టే ఉంది. అందుకే తాజాగా భీకర దాడి కూడా చేశాయి. తాజాగా చైనాలో వారికి ప్రత్యేక స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయని సాటిలైట్ ద్వారా కనిపెట్టారు. ఇదిలా ఉండగా చైనా లో అనేక సంక్షోభాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వంపై ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తుంది. ఇవన్నీ తట్టుకొని మరోసారి తానే అధ్యక్షపదవి చేపట్టాలని జిన్ పింగ్ చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే తమపార్టీ గెలిచే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
అందుకే ఆయా దేశాలపై ఆధిపత్యం చేయడం ద్వారా కాస్త ఓటుబ్యాంకు సాధించుకోవాలని, తన పార్టీని నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అందుకు వేసిన మొదటి ఎత్తు ఆఫ్ఘన్ ఆక్రమణ, అది కాస్త సక్రమంగానే విజయం సాధించింది. కానీ కరోనా పరిస్థితులలో ఇలాంటి హింసాత్మక ఘటనపై ప్రపంచం చలించిపోయింది. దానితో చైనా తాలిబన్ లను వెనకేసుకురావడంతో దాని పాత్ర కూడా ఆక్రమణ వెనుక ఉందని అందరికి అర్ధం అవడంతో చైనా ప్రపంచ వ్యాప్తంగా మరింతగా దిగజారిపోయింది. అయినా ఇప్పటికి తనదే పై చేయి అనిపించుకోవాలని గతేడాది మాదిరిగానే లఢక్ మరియు అరుణాచలప్రదేశ్ సరిహద్దులలో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.  
ఇక తైవాన్ పై కూడా చైనా గురి పడింది. దానికి కారణం కూడా భారత్ తో తైవాన్ చేసుకున్న చిప్ తయారీ ఒప్పందమే. అది కార్యరూపం దాలిస్తే తన చిప్ వ్యాపారం దెబ్బతింటుందని భయంతో తైవాన్ పై నిప్పులు కక్కుతోంది. మొదటి నుండి చైనా పై వైరస్ వలన ఇబ్బంది పడ్డ అమెరికా తైవాన్ కు అండగా నిలిచింది. చైనా హద్దులు మీరు కనిపించినదంతా తనదే అంటూ ఆక్రమించుకుంటే చూస్తూ ఇక ఊరుకునేది లేదని బాహాటంగానే స్పష్టం చేసింది. ఇప్పటికే తైవాన్ లో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసిన అమెరికా అక్కడ సైన్యానికి కూడా శిక్షణ ఇస్తుంది, అలాగే అత్యాధునిక ఆయుధాలను కూడా సమకూరుస్తుంది. తైవాన్ కూడా చైనాకు తలొగ్గకుండా ధీటుగా ఎదిరించి నిలబడింది. ఇలా ఆయా దేశాల పై అక్కసుతో చైనా యుద్ధాలను ప్రేరేపించే దానికి సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: