జగన్ వెనుక ఆ నలుగురు ?

Santhi Kala
ఏపీ వైసీపీలో ఆ నలుగురు నేతలు పార్టిని,ప్రభుత్వాన్ని విజయ వంతంగా నడపడంలో కీలక పాత్ర  పోషిస్తున్నారు.అధినేత అండగా ఉంటూ అన్ని తామై  కీ రోల్ ప్లే చేస్తున్నారు.పరిపాలనా,ప్రజా సమస్యలు,ఉద్యోగుల అంశాల్లో ఒక్కరు, ప్రతిపక్ష టీడీపీ టార్గెట్ గా ఇంకొకరు,డిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని అంశాలను చక్కబెట్టే క్రమంలో ఒకరు అటు పార్టి నేతల్ని సమన్వయం చేస్తూ వివాదాలకు విమర్శలకు చెక్ పెట్టడంలో మరొకరు అధినేతకు అండగా ఉంటూ సక్సస్ ఫుల్  పొలిటికల్ జర్నీని సీఎం జగన్ రన్ చేసేలా తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నారు. అస్సలు సీఎం జగన్ వెనుక అండగా ఉన్న ఆ నలుగురు నేతలు ఎవ్వరు.విమర్శలు,విభేదాలు, వివాదాలకు చెక్ పెడుతూ అన్ని తామై నలుగురు నేతలు నడిపిస్తున్న వేళ పార్టి నేతలు ఏమంటున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల తరువాత  ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అటు పార్టీని,ప్రభుత్వాన్ని వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారు  వైసీపీ ముఖ్య నేతలైన  సజ్జల రామ కృష్ణా రెడ్డి, విజయ సాయిరెడ్డి,వైవి సుబ్బారెడ్డి,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.పార్టీ అధినేత  సీఎం జగన్ మోహన్ రెడ్డికి నలు దిక్కులుగా ఉన్న ఈ నలుగురు నేతలు అటు ప్రభుత్వ, ఇటు పార్టీకి సంబంధించిన అన్ని అంశాలను భుజాన వేసుకోని అధినేతకు అండగా అన్ని తామై నడిపి స్తున్నారు.వైసీపీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలోను ఇటు  ప్రభుత్వంలోనూ నెలకొన్న అనేక అంశాల విషయంలో కీలక పాత్ర పోషిస్తూ విభేదాలకు,విమర్శలకు,వివాదాలకు చెక్ పెడుతు అటు ప్రతిపక్ష టీడీపీ,విపక్షాలకు చెక్ పెడుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఘాడిలో పెట్టేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు.అమరావతి వేదికగా కేంద్ర కార్యాలయం నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర నుంచి మరొకరు,రాయలసీమ సీమ వేదికగా ఇంకొకరు,తాడేపల్లి వేదికగా మరొకరు మొత్తం నలుగురు నేతలు అటు ప్రభుత్వం ఇటు పార్టీని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఏపీలో బలమైన పార్టీని ప్రభుత్వాన్ని జగన్ నేతృత్వంలో నడిపేల తెరవెనుక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.వైసీపీ అధినేత సీఎం జగన్ ఆదేశాలతో  ఎవరికి వారు తమ ముందున్న అన్ని అస్త్రాలను అమలు చేస్తున్న నలుగురు నేతలు తమ ముందున్న అన్ని అంశాలను ప్రయోగిస్తూనే పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న  విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారూ.పరిపాలన పరమైన అంశాలు, ప్రజా సమస్యలు, పార్టీ నేతల మధ్య విభేదాలకు చెక్ పెడుతూ సీఎం  జగన్ కు వెన్నుదన్నుగా మారారు.

సీఎం జగన్ కు అండగా ఉన్న నలుగురు నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణ రెడ్డి ఇప్పుడు పరిపాలన పరమైన అంశాలతో పాటు పార్టీ వ్యవహారాల్లో కీ రోల్ పోషిస్తు న్నారు.వివాదాలకు విమర్శలకు దూరంగా ఉండే సజ్జల ప్రభుత్వ పరిపాలన పరమైన అంశాల్లోకీలక పాత్ర పోషించే అధికారులు, ఉద్యోగులను సమన్వయం చేసుకోవడంతో పాటు పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ  అన్ని అంశాల్లోను తానే ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పాలనపై సీఎం జగన్ పై  వచ్చే విమర్శలను కట్టడి చెయ్యడంతో పాటు అనేక అంశాల్లో కేంద్ర కార్యాలయం వేదికగా అటు 13జిల్లాల నేతలను సమన్వయం చేసుకుంటూనే సీఎం జగన్ కు అండగా ఉన్నారు.ఇప్పటి వరకు అనేక అంశాల్లో జగన్ తీసుకున్న అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చెయ్యడంతో పాటు అటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి.ఇటు ప్రభుత్వ  సలహాదారుగా బాద్యత లు నిర్వర్తిస్తూనే ప్రభుత్వానికి పార్టీకి వారధిగా మారి సీఎం జగన్ అండగా ఉంటూ అన్ని తానై నడిపిస్తున్నా  కూడా హంగు ఆర్భాటాలకు వివాదాలకు దూరంగా ఉంటూనే  సీఎం జగన్ ఇచ్చిన అదేశాలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు.
మరోవైపు సీఎం జగన్ కు అండగా ఉన్న నలుగురిలో విజయసాయి రెడ్డి సైతం కీ రోల్ ప్లే వైసీపీలో చేస్తున్నారు.ఎంపీగా ఉన్న సాయి రెడ్డి ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నంలో  మకాం వేసి ఉత్తరాంధ్రలో అటు టీడీపికి దుకుడుకు బ్రేకులు వేస్తున్నారు.అటు పార్టీకి సంబంధించిన వ్యవహారాలలో ఢిల్లీ వేదికగా అన్ని తానై నడిపిస్తు సీఎం జగన్ డిల్లీ పర్యటన జరిగిన ప్రతిసారి వెన్నంటే ఉండి అటు ఢిల్లీలో జాతీయ స్థాయిలో పార్టీలు కార్యక్రమాలను చక్కబెట్టడంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర వేదికగా పార్టీని ఎస్టాబ్లిష్ చేయడంలో బిజీగా ఉన్నారు విజయసాయి రెడ్డి.ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీకి  బ్రేకులు వేసేలా అనేక అంశాల్లో అటు ప్రత్యక్షంగా,పరోక్షంగా వ్యూహాత్మకంగా ఎత్తగడలు వేసి సక్సెస్ అయిన సాయి రెడ్డి  సీఎం జగన్ ఆదేశాల మేరకు  వెన్నంటే ఉండి వ్యూహాత్మకంగా అడుగులు వేశారని వైసీపీ నేతలు అంటున్నారు.అటు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ,టీడీపీల పొత్తుకు బ్రేకులు వేయడంలో కానీ అధికారంలోకి వచ్చాక రఘు రామ కృష్ణం రాజు ఎపిసోడ్ కేంద్ర మంత్రుల నుంచి ప్రధాని వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వెనుక   సాయి రెడ్డి తనదైన శైలిలో సీఎం జగన్ కోసం  అడుగులు వేశారని వైసీపీ నేతలు అంటున్నారు.

సీఎం జగన్ కు అండగా ఉన్న మరో సీనియర్ నేత  పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి స్టేట్ వైసీపీలో యాక్టివ్  రోల్ పోషించకపోయిన ప్రతిపక్ష టీడీపీని,టీడీపీ అధినేతను టార్గెట్ చేసి జగన్ కు కొండంత అండగా మారారు.స్థానిక సంస్థల ఎన్నికల తరువాత టీడీపీ అధినేత సొంత నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయడం దగ్గర నుంచి చంద్రబాబు టార్గెట్ గా చిత్తూరు జిల్లాలో పార్టిని ముందుండి నడిపించడంలో డిఫరెంట్ స్టైల్ అని  వైసీపీ నేతలు అంటున్నారు.సీఎం జగన్ తండ్రి వైస్సార్ తో ఉన్న అనుబంధం టీడీపీ అధినేత చంద్రబాబుతో  ఉన్న రాజకీయ  వైరం సీఎం జగన్ కు పెద్దిరెడ్డిని మరింత దగ్గరయ్యేలా చేసింది.రాజకీయంగా సీనియర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సీనియర్  కావడంతో  సీఎం జగన్ మానస పుత్రికగా  ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల పథకాల అమలుకు కీలకంగా ఉన్న శాఖకు సైతం  మంత్రిని చేసారు సీఎం జగన్,దీనితో  అన్ని తానై పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి  నడిపిస్తు తన శాఖతో పాటు క్షేత్ర స్థాయిలో పధకాలు అమలుకు శ్రీకారం చుట్టేలా నిత్యం బిజీబిజీగా మారారు.అటు నియోజకవర్గంలో చంద్రబాబును డీ కొడుతూనే ఇటు టీడీపీ కంచుకోటలో వైసీపీని బలోపేతం చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.పార్టీ ప్రారంభం నుంచి జగన్ వెన్నంటే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీలో సీనియర్ నేతగా పరిపాలన పరమైన అంశాల్లో  తనదైన పాత్ర పోషిస్తు సీఎం జగన్ కు అండగా మారారు.
మరోవైపు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న వైవి సుబ్బారెడ్డి సైతం సీఎం జగన్ అండగా ఉండటంతో పాటు  వైసీపీలో అన్ని తానై నడిపిస్తు వైసీపీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.సీఎం జగన్ కు సమీప బంధువు కావడం సీనియర్ నేతగా వివాద రహితుడిగా పేరున్న వైవి సుబ్బారెడ్డి పార్టీని పార్టి లోని నేతలను ఒక వేధికపైకి తీసుకురావడంలో  కీలక పాత్ర పోషిస్తున్నారు,ప్రస్తుతం టిటిడి చైర్మన్ గా ఉన్నా పార్టీలో పదవులు పంపకాలు,నియోజకవర్గ పరిదిలో నేతల మధ్య  నెలకొన్న వివాదాలు,విభేదాలకు చెక్ పెట్టేలా వ్యవహారించడంలో కీ రోల్ పోషిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి.ఎంపీగా పని చేసిన అనుభవం పాటు వైస్సార్ తో  అనుబంధం కారణంగా  వైసీపీలో నాయకత్వ మార్పులు,నామినేటెడ్ పోస్టుల భర్తీ లాంటి అంశాల్లో  సీనియర్లకు పెద్ద పీట వేయడం లాంటి మార్పులు, చేర్పులు ప్రభుత్వం,పార్టీ పరంగా సమూలంగా ,సమిష్టిగా సీఎం జగన్ తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగులు వేయడంలోను దిట్టగా పేరొందారు వైవి సుబ్బారెడ్డి.ఆద్యాత్మిక క్షేత్రం టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆయన సమూల మార్పుల దిశగా అడుగులు వేసి రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు.టీటీడీ విషయంలో  ప్రభుత్వంపై  చేస్తున్న విమర్శలకు ఎక్కడా తావివ్వకుండా తనదైన శైలిలో అడుగులు వేస్తూ సీఎం జగన్ కు అండగా ఉన్నారు వైవి సుబ్బారెడ్డి.
మొత్తానికి సీఎం జగన్ మోహన్ రెడ్డికి నలుగురు నేతలు  అండగా ఉంటూ అన్ని తామై నడిపిస్తున్నారు.వివాదాలకు విమర్శలకు,విభేదాలకు చెక్ పెడుతూ నలు దిక్కులు సీఎంకు అండగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: