అదే ఫార్మాట్..ఇలా అయితే కష్టం బాబు...!

VUYYURU SUBHASH
నలభై ఏళ్ల రాజకీయ జీవితం...ఎన్నోసార్లు తన వ్యూహాలతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టిన నాయకుడు. అందుకే ఆయనకు రాజకీయ చాణక్యుడు అనే పేరు. కానీ ఆ చాణక్యం ప్రస్తుత రాజకీయాల్లో వర్కౌట్ కావడం లేదు. రోజురోజుకూ రాజకీయం మారిపోతుంది...ఆ రాజకీయానికి తగ్గట్టుగా ఆయన వ్యూహాలు మారడం లేదు. ఇప్పటికీ అదే ఓల్డ్ ఫార్మాట్‌లో రాజకీయం చేస్తున్నారు. అలా ఓల్డ్ ఫార్మాట్‌లో రాజకీయం చేస్తున్నది ఎవరో ఈ పాటికి క్లారిటీ వచ్చేసి ఉండాలి. అందరూ అనుకుంటే టి‌డి‌పి అధినేత చంద్రబాబు...ఇప్పటికీ పాత రాజకీయాలని చేస్తున్నారు.

దాని వల్ల పార్టీకి పావలా ఉపయోగం రాలేదనే చెప్పాలి. వైసీపీ శ్రేణులు తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసారని చెప్పి, చంద్రబాబు అదే ఆఫీసులో 36 గంటల పాటు దీక్ష చేశారు. ఇక దీక్ష అంటే నాలుగు సోఫా సెట్లు, చుట్టూ కూలర్లు, తమ నేతల చేత దండాలు పెట్టించుకోవడం, ఇక వారేమో చంద్రబాబుని పొగడటం, జగన్‌ని తిట్టడం. ఇక ఇదే పని...దీని వల్ల అసలు జనాలకు దీక్ష ద్వారా బాబు ఏం చెప్పాలనుకున్నారు....అసలు ఏం చెప్పారనేది క్లారిటీ లేకుండా పోయింది.

పైగా ఎప్పటిలాగానే అదే బోరింగ్ స్పీచ్....బాబు స్పీచ్‌ల్లో కొత్తదనం ఉండటం లేదు. గంభీరంగా మాట్లాడుతున్నారు గానీ, అందులో జనాలని ఆకట్టుకునే పాయింట్లు ఉండటం లేదు. ఈరోజుల్లో గట్టిగా మాట్లాడటం కంటే...జనాలని ఆకట్టుకునేలా మాట్లాడటమే మెయిన్. ఉదాహరణకు తెలంగాణ సీఎం కేసీఆర్... ఎంత తెలివిగా జనాలని ఆకట్టుకునేలా మాట్లాడతారో చెప్పాల్సిన పని లేదు. ఇక రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ లాంటి వారి స్పీచ్‌లు కూడా జనాల్లోకి బాగా వెళ్తాయి.

కానీ బాబు మాట్లాడే మాటలు జనాల్లోకి వెళ్లవు...పైగా నాన్‌స్టాప్‌గా మాట్లాడుతారు. దానికి తోడు ఈ మధ్య బాబు, జనాలని ఎక్కువ నిందిస్తున్నారు. జగన్‌ని గెలిపించి జనాలు తప్పు చేశారని, జనంలో చైతన్యం రావాలని, తనకు సహకరించాలని అంటారు. అసలు తాను చెప్పాల్సిన రీతిలో చెబితే, జనమే సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా ప్రజలని నిందించడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ ఫార్మాట్ వదిలేసి బాబు కాస్త మారితే బెటర్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: