చంద్రబాబు ఢిల్లీ టూర్ జగన్ పై ఎఫెక్ట్ చూపనుందా?

VAMSI
ఏపీలో రాజకీయ పరిణామాలు జోరుగా మారిపోతున్నాయి. మొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పట్టాభి రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం జగన్ పై చేసిన పరుషమైన వ్యాఖ్యలు ఇంత అల్లర్లకు దారి తీస్తాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒకే ఒక్క పదం "బోసీడీకే" ఇంత గందర గోళం సృష్టిస్తుందా అన్నది మొదటి సారి చూస్తున్నాము. ఆ తర్వాత జరుగుతున్న సంఘటనలు రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపాయి. పట్టాభి చేసిన వ్యాఖ్యల అనంతరం వైసీపీ అభిమానులు అని ఇప్పటి వరకు టీడీపీ చెబుతున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీస్ లపైన దాడులు చేశారు. ఈ విషయం తెలిసి ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్న ఏపీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అని తెలిసింది.
ఏపీలో రౌడీ రాజ్యం మొదలయింది అని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన రోజే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికి నిర్ణయించుకున్నారు. అందు కోసం ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. అయితే చంద్రబాబు అనుకుంటున్న ప్రకారం కేంద్ర తన విజ్ఞప్తిని అంగీకరిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. అసలు చంద్రబాబు వీరితో ఏ విషయాల పైన మాట్లాడనున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చంద్రబాబు కు తగిన సమయం కేంద్రం కేటాయిస్తుందా? మోదీ అమిత్ షా లు ఎలా వ్యవహరించనున్నారు? అన్నది తెలియాల్సి ఉంది.
ఐతే ఈ భేటీ జగన్ కు ప్రతికూలం అవుతుందా అంటే ఎంత మాత్రం కాదనే చెప్పాలి. ఎందుకంటే మొదటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వ ఏపీ సీఎం జగన్ తో మంచి బంధాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి చంద్ర బాబు మోదీ అమిత్ షా చెవుల్లో ఎంత ఊదినా ఉపయోగం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు ఏమి జరుగుతుంది అన్నది తెలియాలంటే మరి కొంత సేపు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: