ఎవరి పర్ఫామెన్స్ వారిది.. కన్ఫ్యూజన్‌లో రాష్ట్రం...?

M N Amaleswara rao
సినిమాల్లోనే నటులని మించిపోయారు...ఏపీలో ఉన్న రాజకీయ నాయకులు..అసలు ప్రజలని ఆకర్షించడంలో ఎవరి పర్ఫామెన్స్ వారిది. అసలు పర్ఫామెన్స్‌లో ఎవరూ తగ్గడం లేదు. నిజంగా ప్రజలకు సేవ చేయాలని ఎవరు అనుకుంటున్నారో తెలియడం లేదు గానీ, ఏదో రకంగా చేస్తున్నట్లు నటించి...ప్రజలని తమ వైపుకు తిప్పుకోవాలని అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పిలు ప్రయత్నిస్తున్నాయి. అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు.
తాజాగా జరుగుతున్న ఘటనల విషయంలో నాయకులు ఎవరికి తగ్గటుగా వారు జీవిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రజలకే బాగా తెలుసు. ఎందుకంటే అనుభవించేది వారే కాబట్టి, కానీ అవి వదిలేసి నాయకులు...తమ మైలేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. టి‌డి‌పి నేత ఏమో జగన్‌ని తిట్టడం...దానికి బీపీ వచ్చి వైసీపీ శ్రేణులు...టి‌డి‌పి ఆఫీసులపై దాడులు చేశారు.
సరే ఇక్కడ ఎవరిది తప్పు...ఎవరిది ఒప్పు అనడానికి ఏది క్లారిటీగా లేదు. ప్రజలే దీనిపై క్లారిటీ తెచ్చుకోవాలి. కానీ మీది తప్పు అంటే మీది తప్పు అని వైసీపీ-టి‌డి‌పిలు ఇంకా తిట్టుకుంటున్నాయి. అయితే ఈ అంశాలని రాజకీయంగా వాడుకోవడంలో ఏ పార్టీ తగ్గడం లేదు. తమ నాయకుడునే తిడతారనే చెప్పి వైసీపీ నేతలు, చంద్రబాబుని ఇంకా పచ్చి బూతులు తిడుతున్నారు. అలాగే సి‌ఎంని తిడితే జనాలని తిట్టినట్లే అని, అందుకే జనాలు చంద్రబాబుపై ఆగ్రహం ఉన్నారని చెప్పి, జనగ్రహ దీక్షలు చేస్తున్నారు. అటు సి‌ఎం జగన్ సైతం...తనని తిట్టారని, ఏమని తిట్టారో కూడా తన నోటితో చెప్పే వరకు వచ్చింది. అంటే అది నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదే ఇక్కడి రాజకీయం.
ఇటు టి‌డి‌పి ఏమో....వైసీపీ నేతలు తమని ఎన్ని సార్లు పచ్చి బూతులు తిట్టారో జనాలకు తెలుసని, అలాగే ఆఫీసులపై దాడికి నిరసనగా చంద్రబాబు...అదే ఆఫీసులో ధర్మగ్రహ దీక్ష అని చేస్తున్నారు. నాలుగు సోఫా సెట్టింగ్‌లు పెట్టుకుని, తమ నేతలతో పొగిడించుకుంటూ, జగన్‌ని తిట్టిస్తున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తున్నారు. మరి ఈ పర్ఫామెన్స్‌లో ఎవరిది నమ్మాలో జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: