ఎక్కడ కొట్టుకుందాం, కేశినేని కామెంట్స్ తో చంద్రబాబు షాక్...?

Gullapally Rajesh
జగన్ అంటే వీరుడు సూరుడని చెప్పుకుంటారు... ఏదైనా ఉంటే చెప్పండి డైరెక్ట్ ఫైట్... విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్సా..? వీఎంసీ గ్రౌండ్సా ఏదోకటి తేల్చేసుకుందాం, వైసీపీ నేతలు టైమ్.. డేట్ చెబితే మేమూ వచ్చేస్తాం అంటూ విజయవాడ ఎంపీ కేశినేని  సంచలన కామెంట్స్ చేసారు. వైసీపీ ఎక్కడంటే అక్కడ మా వాళ్లు రెడీగా ఉన్నారు.. కొట్టుకుందాం అంటే కొట్టేసుకుందాం అని ఆయన సవాల్ చేసారు. రోజూ కొట్టుకుంటూ ఏపీకి చెడ్డ పేరు తేవద్దు అని జగన్ రాక్షస పాలనను ప్రపంచం అంతా చెప్పుకుంటోంది అన్నారు.
రౌడీయిజం, గుండాయిజం అంటే పిరికిచర్య అని ఆయన పేర్కొన్నారు. 2019లో జగనుకు గొప్ప అవకాశం వచ్చింది అన్నారు కేశినేని. గొప్ప అవకాశం వస్తే గొప్పగా పాలించి ప్రజా తీర్పును గౌరవించాలి అని సూచించారు. ఏం చేసినా ప్రజలు ఒప్పుకుంటారని భావిస్తే అది చెల్లుబాటు కాదు అన్నారు ఆయన. ఓటర్లు తగిన సమయంలో మూల్యం చెల్లిస్తారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా శాంతి భద్రతల సమస్య వచ్చిందా..? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో వైసీపీ వాళ్లు తప్పు చేసిన సంయమనంతో ఉన్నాం అన్నారు.
రేపనేది ఉంటుందని జగన్ గుర్తుంచుకోవాలి అని ఆయన హితవు పలికారు. హిట్లర్, సద్దాం వంటి డిక్టేటర్లను చూశాం...జగన్ కు త్వరలో ప్రజలు బుద్ది చెబుతారు అని అన్నారు. ఏపీని జగన్ ఏం చేద్దామనుకుంటున్నారు..? అని ఆయన నిలదీశారు. విఙాన గనిగా ఉన్న ఏపీని గుండా ఏపీని చేస్తారా..? రౌడీ ఏపీ చేస్తారా..? అని అంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీలోని యువతను డ్రగ్ ఎడిక్టులను చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారా..? అని మండిపడ్డారు. ఏపీలో పిల్లలను చదివించాలంటే డ్రగ్స్ బారిన పడతారేమోననే భయం తల్లిదండ్రుల్లో కన్పిస్తోంది అన్నారు. మద్య నిషేధం చేస్తానని జగన్ చెబితే.. వైసీపీ నేతలే సారాకు రంగేసి మద్యం అమ్ముతున్నారు అని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అనేక క్రైములు జరగడానికి కారణం మద్యం పాలసీనే అన్నారు ఆయన.కేశినేని నానీ కామెంట్స్ తో చంద్రబాబులో ఉత్సాహం కనపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: