సుచరితకు పవన్ షాక్ తప్పదా?

M N Amaleswara rao
మేకతోటి సుచరిత....మొదట నుంచి వైఎస్సార్ ఫ్యామిలీకి వీరవిధేయురాలు. ఆ ఫ్యామిలీ సపోర్ట్‌తోనే రాజకీయాల్లోకి వచ్చి...సక్సెస్ చూశారు. దివంగత వైఎస్సార్ 2003లో పాదయాత్ర చేసే సమయంలో, వైఎస్ మీద అభిమానంతో సుచరిత కాంగ్రెస్‌లో చేరారు. ఇక వైఎస్సార్ సపోర్ట్‌తో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2006లో జెడ్‌పి‌టి‌సిగా కూడా గెలిచారు. 2009 ఎన్నికల్లో వైఎస్సార్..సుచరితకు ప్రత్తిపాడు సీటు ఇచ్చారు. ఇక వైఎస్సార్ అండతో సుచరిత మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
వైఎస్సార్ మరణంతో కాంగ్రెస్‌కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలోనే 2012 ఉపఎన్నికలో ప్రత్తిపాడు నుంచి వైసీపీ తరుపున నిలబడి విజయం సాధించారు. ఇక 2014లో ఓటమి పాలైన సుచరిత...2019 ఎన్నికల్లో జగన్ గాలిలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ మాదిరిగానే జగన్‌ కూడా సుచరితకు మంచి పొజిషన్ ఇచ్చారు. క్యాబినెట్‌లో హోమ్ మంత్రిని చేశారు.
ఇక హోమ్ మంత్రిగా సుచరిత పనితీరు ఎలా ఉందనే విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. సుచరిత...జగన్ పట్ల ఎంత విధేయతతో ఉంటారో కూడా చెప్పాల్సిన పని లేదు. హోమ్ మంత్రిగా సుచరిత ఎలా రాణిస్తున్నారు....ఎమ్మెల్యేగా ప్రత్తిపాడు ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలా హోమ్ మంత్రిగా ఉన్న సుచరితకు నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలవడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి. జగన్ ఇమేజ్, తన పనితీరుతో సుచరితకు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి.
కాకపోతే ప్రత్తిపాడులో టి‌డి‌పి నిదానంగా బలపడుతూ ఉంది. అదే సమయంలో గుంటూరులో జనసేన ప్రభావం పెద్దగా ఉండకపోయినా, ప్రత్తిపాడులో కాస్త ప్రభావం చూపుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో అంతటి జగన్ గాలిలో సైతం సుచరిత....టి‌డి‌పి మీద సుమారు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు వచ్చి...26 వేలు అంటే. నెక్స్ట్ గానీ టి‌డి‌పికి పవన్ కల్యాణ్ సపోర్ట్ ఇస్తే పరిస్తితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి సుచరితకు పవన్ షాక్ ఉండే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: