కల్యాణ్ బాబు ప్లాన్ ఛేంజ్... ఒక్క ఛాన్స్?

M N Amaleswara rao
రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడమే రాజకీయ నాయకుల పని. అయితే ఆ పని ఇంతవరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేయలేకపోయారనే చెప్పాలి. అందుకే ఆయన ఎక్కువ సక్సెస్ కాలేకపోయారు. పార్టీ పెట్టి 8 ఏళ్ళు అయినా సరే....పవన్ రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు సపోర్ట్ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో చిన్నాచితక పార్టీలతో పొత్తు పెట్టుకుని విఫలమయ్యారు. కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైపోయారు.
అయితే పవన్ పూర్తిగా రాజకీయాలు చేయకపోవడం వల్లే అలాంటి ఫలితాలు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. అలాగే చంద్రబాబు, జగన్‌లాంటి నాయకుల మధ్య పవన్ రాజకీయంగా ఎదగలేకపోయారు. కానీ ఇకపై రాజకీయంగా ఎదిగేందుకు పవన్‌కు మంచి ఛాన్స్. ఇప్పటికే రెండున్నర ఏళ్ళు కావొస్తుంది..ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్ళు ఉన్నాయి.  కాబట్టి ఈలోపు సొంతంగా పవన్ ఎదగాల్సిన అవసరముంది.


ఏదో మొన్నటివరకు సేఫ్ సైడ్‌గా బి‌జే‌పి పొత్తు పెట్టుకుని బండి నడిపించుకుంటూ వచ్చారు. కానీ బి‌జే‌పి వల్ల పావలా ఉపయోగం లేదని ఎప్పుడో అర్ధం కావాలి...కానీ ఇప్పుడుప్పుడే అది అర్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు బి‌జే‌పికి దూరం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో టి‌డి‌పికి దగ్గరవ్వకూడదు. టి‌డి‌పికి దగ్గరైన సరే సొంతంగా ఎదిగే అవకాశం పవన్‌కు ఉండదు. ఎన్నికలకు ఎలాగో రెండున్నర ఏళ్ల సమయం ఉంది కాబట్టి, అప్పటివరకు సొంతంగా బలపడాల్సిన అవసరముంది.
పైగా బలపడటానికి ఇదే మంచి సమయం..అంతకముందు ఐదేళ్లు పాలనలో టి‌డి‌పి ఫెయిల్ అయింది. ఇక వైసీపీ వల్ల కూడా ప్రజలకు ఉపయోగం లేదని ఈ రెండున్నర ఏళ్ల సమయంలో చాలావరకు అర్ధమైంది. అంటే ప్రజలకు టి‌డి‌పి, వైసీపీల పట్ల అభిమానం కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో పవన్....తాను ప్రజలకు ఎలా అండగా ఉంటారో ఇంకా స్ట్రాంగ్ గా చెప్పాల్సిన అవసరముంది. తనకు కూడా ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చేలా చేసుకోవాలి. అప్పుడే పవన్ కూడా రాజకీయంగా సక్సెస్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: