ఒవైసీ లో మార్పు.. భారత ముస్లింల స్వాతంత్రత.. !

Chandrasekhar Reddy
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ సమాజంలో మార్పులు వస్తున్నాయి. అంటే ఆఫ్ఘన్ ఆక్రమణ అనంతరం ఈ వ్యవస్థలో ఆంక్షలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఆంక్షల నేపథ్యంలో  కనీసం మహిళలు స్వాతంత్రంగా బ్రతకలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆంక్షలు నెమ్మది నెమ్మదిగా పెరిగిపోవడానికి తాలిబన్ ఒత్తిడిగానే పరిగణిస్తుంది సమాజం. ఆఫ్ఘన్ అనంతరమే ఈ ఆంక్షలు పాక్ ను చుట్టుముట్టాయి. తరువాత ఆ తరహా దేశాల లో అన్ని మతాలు కలిసి బ్రతుకుతున్న సమాజాలలో కూడా బేదాభిప్రాయాలు తెచ్చేందుకు తాజాగా హిందువుల పూజా మండపాలపై కొందరు దుండగులు ఇష్టానికి ప్రవర్తించారు. ఇవన్నీ ఆయా సమాజంలో ఉండే ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలుగా ప్రపంచం కూడా గుర్తించింది. అందుకే అందరిని సంయమనం పాటించాలని ఆయా దేశాల అధినేతలు సూచించరు.
ఈ తరహా ఆంక్షలు భారత్ లో ని ముస్లిం లపై మొదటి నుండి లేవు. ఆయా కుటుంబాలలో కొన్ని ఇప్పటికి వారి సాంప్రదాయాలను పాటించాలని ఒత్తిడి తెస్తారు తప్ప, చదువుకోవద్దు, బయటకు వెళ్ళవద్దు, ఆ దుస్తులు వేసుకోవద్దు.. లాంటి నియమాలు అంతగా భారత్ లో కే అనిపించవు. అంటే ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం స్వేచ్ఛగా బ్రతికేస్తుంది. కానీ ఎక్కడైనా కొందరు అది కూడా ఇటీవల మొదలైనది, బురఖా వేసుకుని వస్తున్న మహిళలతో దురుసుగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. ఇది కూడా తాలిబన్ ల బినామీలు లేదా పాక్ ప్రేరేపిత సుంటలు చేసేవి తప్ప భారతీయులు అన్నిసమయాలలో మతస్వేచ్చతో, కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఇక్కడ ఆ స్వేచ్ఛ స్పష్టంగా కనిపిస్తుంది.
తాజాగా ఒవైసీ అధ్యక్షుడు అసదుద్దీన్ కూడా తమ సమాజంపై కొందరు కావాలనే గొడవలు చేస్తున్నారు. అవి మానుకోవాలని పై సందర్భాన్ని బట్టి స్పష్టం చేశారు. ఇక్కడ అందరం కలిసే ఉంటాం, మా బిడ్డల మనసులలో కూడా ఎక్కడ తారతమ్యాలు లేవు, ఎవరో వచ్చి వాటిని సృష్టించడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని ఆయన స్పందించారు. ఇది భారతదేశంలో ఐక్యతను మరోసారి  చాటి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: