బాబోరి ఢిల్లీ ప్రయాణం రద్దు కానుందా?

VAMSI
ప్రస్తుతం ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఏ విషయం దొరుకుతుందా అని వెయిట్ చేసే టీడీపీ బ్యాచ్ కు ఇది బాగా ఉపయోగపడింది. అందుకే నిర్విరామంగా టోటల్ టీడీపీ బ్యాచ్ అంతా వైసీపీని విమర్శించే పనిమీద బిజీగా ఉన్నారు. అసలు ఈ దాడికి సంబంధించి వివరాలు ఏమీ తెలియలేదు. దీని వెనుక ఎవరున్నారు అనే విషయం ఇంకా రుజువు కాలేదు. అయినప్పటికీ టీడీపీ నాయకులు జగన్ ను ఉద్దేశించి దారుణమైన పదజాలాన్ని వాడుతూ విమర్శిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ దాడులపై కేంద్రానికి తన బాధను చెప్పుకోవడానికి గ్రేట్ లీడర్ ఆఫ్ ఏపీ చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకుని దాడులపై దృష్టి పెట్టాలని బాబోరు వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి రావడానికి అర్హత లేదని చెప్పారని, ఇప్పుడెలా మళ్లీ జోక్యం చేసుకోండి అని అడుగుతారని ఎదురు ప్రశ్నించారు. అయితే జి వి ఎల్ వ్యాఖ్యలను బట్టి బాబోరు ఢిల్లీ వెళ్లకపోవడం మంచిదని అర్థమవుతోంది. ఒకవేళ వెళ్ళినా మోదీ అమిత్ షా లు తగిన విధంగా స్పందిస్తారని నమ్మకం లేదు.
బీజేపీ లో ఎవ్వరైనా మీడియా ముందు ఒక వ్యాఖ్య చెయ్యాలంటే అది అధిష్టానం కు తెలిసి మాత్రమే చేస్తారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు ఢిల్లీ కి వచ్చినా ఒరిగేది ఏమీ లేదని జి వి ఎల్ ద్వారా చెప్పించారు అని కొందరంటున్నారు. మరి ఇవన్నీ చంద్రబాబుకు అర్థమవుతాయా ? ఢిల్లీ కి వెళ్తారా? లేదా రద్దు చేసుకుంటారా ? అన్నది తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: