పట్టాభీ.. ఖబడ్దార్‌.. ఊగిపోయిన వైసీపీ శ్రేణులు..?

Chakravarthi Kalyan
టీడీపీ నేత పట్టాభి ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. సీఎంను పట్టుకుని బోస్‌డీకే... ఏరా.. బానిస.. అరే.. అంటూ పలుసార్లు సంభోదిస్తూ పట్టాభి ప్రెస్ మీట్ నిర్వహించడం వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ప్రెస్ మీట్ ముగిసిన కొన్ని గంటల్లోనే వైసీపీ ఆందోళనలు రాష్ట్రమంతటా మొదలయ్యాయి. ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. హిందూపురంలోని బాలయ్య ఇంటి వద్ద కూడా ఆందోళన నిర్వహించాయి.

ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత‌ పట్టాభి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ అంతటా వైయ‌స్ఆర్ సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.  గత కొన్ని నెలలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత పట్టాభి.. ఇవాళ మరింత దిగజారారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పట్టాభి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సీఎంను ఏకవచనంతో దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించాయి.

తిరుపతిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  వైసీపీ చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మ తగలబెట్టారు. తిరుపతి ఆర్టీసి బస్టాండ్ కూడలి లోని గాంధీ విగ్రహం  ముందు చంద్రబాబు , పట్టాభి  దిష్టి బొమ్మలు దహ‌నం చేశారు. టీడీపీ నేతలు ఎలాంటి ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేతలు. పట్టాభి తెలుగుదేశంలో పెయిడ్‌ ఆర్టిస్ట్ అని వర్ణించారు.

అటు విశాఖపట్నంలోనూ వైసీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. చంద్రబాబు దిష్టిబొమ్మను తగలపెట్టాయి. ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టాయి. కర్నూలో ఆందోళన చేసిన వైసీపీ నేతలు.. టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు దర్శకత్వంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: