రేవంతూ ఇది కరెక్ట్ యేనా...?

Gullapally Rajesh
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో వివాదాలు ఎక్కువగానే వస్తున్నాయి అనే మాట వాస్తవం. రాజకీయంగా పార్టీని ముందుకు నడిపించే క్రమంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి కొంత మంది నాయకులను కాంగ్రెస్ లో పట్టించుకోవడం లేదు అని ఆవేదన చాలామందిలో వ్యక్తమవుతోందని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం తీవ్రంగా కష్ట పడిన వాళ్ళను కూడా రేవంత్ రెడ్డి నాలుగేళ్ల క్రితం వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని దీంతో పార్టీలో చాలావరకు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం సైలెంట్ గా తయారవుతోందని అంటున్నారు.
రేవంత్ రెడ్డి ఏదైనా కార్యక్రమాలను చేస్తే చాలా మంది నాయకులకు సమాచారం ఉండటం లేదు. కనీసం గాంధీభవన్ బాధ్యతలు చూసే నాయకులకు గానీ లేకపోతే నియోజకవర్గాల బాధ్యతలు చూసే నాయకుల మాట వరసకైనా చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయటం లేదు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు కావడంతో కాస్త కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చింది. దీంతో వరుసగా నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీ బలోపేతం కోసం ఎక్కువగానే కష్టపడుతున్నారు రేవంత్ రెడ్డి.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు ఈటెల రాజేందర్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి చాలా హామీలు ఇచ్చినా సరే అది సఫలం కాలేదు. ఇక ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారా కనీసం కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేయకుండా సొంత కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వహిస్తున్నారని ప్రతి నియోజకవర్గంలో కూడా తనకంటూ ఒక వర్గం తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చాలా మంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి విషయంలో సీరియస్ గా ఉన్నారట. ఇదే గనక భవిష్యత్తులో కూడా కొనసాగితే ఖచ్చితంగా తమ పార్టీలో కొనసాగే లేదని ఇటువంటి వైఖరి కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: